రామచంద్రయ్య తీరు మరీ విచిత్రం
posted on: Jun 23, 2014 12:19PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా విభజించి, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితిలో వుండటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టిన ప్రతి ఒక్కరూ కారణమే. ఆ కారకుల లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా వుంటారు. రాజ్యసభ సభ్యుడైన రామచంద్రయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన సభలో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మోసే ప్రయత్నంలో వున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీని విమర్శించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా దుర్భరమైన పరిస్థితిలో వుంది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకి అసలు నచ్చడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయిందని, తీవ్ర ఆర్థికలోటులో వుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పడాన్ని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య భరించలేకపోతున్నారు. ఒక్క హైదరాబాద్ విషయంలో తప్ప మరే విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ భేషుగ్గా వుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేయడం కాంగ్రెస్ పార్టీ వంతు.. ఇప్పుడు నాశనమైపోయిందని బాధపడుతున్నా వద్దనడం కూడా కాంగ్రెస్ పార్టీ వంతు అని రామచంద్రయ్య భావిస్తున్నట్టున్నారు. మొత్తమ్మీద రామచంద్రయ్య తీరు మరీ విచిత్రంగా వుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.



.jpg)
.jpg)

.webp)



