ఆంధ్ర, తెలంగాణా శాసనసభల నిర్వహణలో ఎంత తేడానో
posted on: Mar 19, 2015 10:47AM
.jpg)
ఆంద్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల తీరు చూసి ముక్కున వేలేసుకొంటున్న ప్రజలు తెలంగాణా శాసనసభను చూసి మెచ్చుకొంటున్నారు. ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 40 రోజులు ఎందుకు పెట్టలేదనే అంశంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలయిన యుద్ధం పట్టిసీమతో పరాకాష్టకు చేరుకొంది. నిన్న సభలో సభ్యులు ప్రవర్తించిన తీరు చూసిన తరువాత ఈ మాత్రం దానికి 17 రోజులు సమావేశాలు కూడా అనవసరమని ప్రజలు భావిస్తున్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, బీజేపీలు మూడు కూడా రాజకీయంగా శత్రువులే అయినప్పటికీ, ఆ మూడు పార్టీల సభ్యులు శాసనసభలో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నతీరు చాలా ముచ్చట గొలుపుతోంది. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై సభ్యులు అందరూ లోతుగా చర్చించడం, అధికార పార్టీ చెపుతున్న విషయాల గురించి ప్రతిపక్షాలు ఆసక్తిగా అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తుండటం, వాటిని అధికార పార్టీ వినమ్రంగా స్వీకరిస్తుండటం చూస్తుంటే చాలా ముచ్చట కలుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులు నిన్న ఒకరినొకరు బూతులు తిట్టుకొంటుంటే, తెలంగాణా శాసనసభ లో సభ్యులు అందరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరు రాష్ట్రాల శాసనసభల నిర్వహణలో, సభ్యులు వ్యవహరిస్తున్న తీరులో చాలా తేడా కనబడుతోంది. ఒకే సమయంలో, ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్రాల శాసనసభలు జరుగుతున్నందున ఆ తేడా మరీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది.



.jpg)
(3).jpg)


.webp)


