దొంగ, పోలీస్ ఆటాడించి అత్తను చంపిన కోడలు
posted on Nov 9, 2025 10:45AM

అత్త కోడలు మధ్య విభేదాలు సహజంగా ఉంటాయి. కానీ ఆ కోడలు ప్రేమతో అత్తతో దాగుడుమూతలు ఆట ఆడింది. నిజంగా అన్యోన్య భావంతో కోడలు ఆటాడిందని పొరపాటు పడొచ్చు. ఆ ఆట వెనక ఓ హత్య ఉంటుందని అత్తకు తెలియ లేదు. ఓ నిండు ప్రాణం ఆ ఆటలో ఆగిపోయింది. విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ దాగుడుమూతల ఆటలో ఏం జరిగింది
విశాఖ నగర శివారు సింహాచలం దగ్గర అప్పన్నపాలెం వద్ద వర్షిని అపార్ట్మెంట్లో జయంతి కనకమాలక్ష్మి అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు పురోహితుడు. భార్య ఇద్దరు పిల్లలు 66 సంవత్సరాల ఆ తల్లితోపాటు భార్య తల్లి కూడా ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ దశలో ఈనెల 7వ తేదీన కోడలు లలిత అత్త కనక మహాలక్ష్మి తో దాగుడుమూతలు ఆట ఆడాలని చెప్పింది దీనికి పిల్లలను కూడా పిలిచి నాన్నమ్మకు కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లకు తాళ్లు కట్టి దాగుడుమూతల ఆట ఆడాలని చెప్పింది .
దాంతో పిల్లలు ఆమె కలిసి అత్త కనక మహాలక్ష్మికి చేతులు కాళ్లు కుర్చీకి కట్టేశారు ఆటలో భాగంగా చిన్న పిల్లలు గదుల్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొంత సేపటికి మంటలతో అత్త కనకమహాలక్ష్మి కేకలు వేస్తూ మంటల్లో తాళ్లు తెగిపోవడంతో హాల్ నుంచి దేవుడు గదిలోకి పరుగులు తీసింది ఆ కేకలు విని గదిలో ఉన్న మనవరాలు కూడా రావడంతో ఆమె కూడా మంటలకు గాయపడింది కొద్దిసేపటికి కోడలు లలిత తల్లి కూడా బయటకు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే తీవ్రమైన మంటల గాయాలతో కనక మహాలక్ష్మి కుప్పకూలి చనిపోయారు..
..
అతను అంతం చేసేందుకు కోడలు ట్రిక్..
..
ఒక ఇంట్లో అత్తా కోడలు నివాసం ఉండడంతో మనస్పర్ధలు ఇటీవల ఏర్పడ్డాయి తరచూ తనపై భర్తకు అత్త విషయాలు చెప్పడంతో ఆయన తనను నిందిస్తున్నారని కోడలు లలిత కోపం పెట్టుకుంది. అత్తను చంపేస్తే మంచిదని నిర్ణయించింది దీనికోసం హౌ టు కిల్ అనే యూట్యూబ్ వీడియోలను పరిశీలించింది అందులో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ఆమెను ఆకట్టుకుంది.
ఆ ప్రకారం అతను దాగుడుమూతలు ఆట ఆడుదామని చెప్పి లలిత పద్ధతి ప్రకారం చంపేసింది. ముందుగా పిల్లలతో కలిసి కుర్చీలో అత్తకు కాళ్ళు చేతులు కాళ్లతో కట్టి కట్టి వాళ్లు గదుల్లో దాక్కునగా ముందు రోజు తీసుకు వచ్చిన పెట్రోల్ అత్తపై పోసి కోడలు లలిత నిప్పు అంటించింది. మంటల్లో కాలి చనిపోతుందని ఆమె లలిత భావించింది. ఆ క్రమంలోనే అతను హత్య చేసింది.
..
నిందితురాల్ని పట్టించిన రెండు కారణాలు
..
సాంప్రదాయ రీతిన జీవనం సాగించే ఇంటిలో జరిగిన ఈ ఘటన పై ఎవరికి అనుమానం రాలేదు. అత్త దాగుడుమూతలు ఆట ఆడుతుండగా టీవీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి కాలిపోయారని కోడలు లలిత ముందుగా పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు కూడా అనుమానించలేదు. అయితే ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడగా అత్త దేవుడికి దీపం పెడుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని చెప్పారు
పరస్పర విరుద్ధమైన ఈ రెండు కారణాలు ఆ కోడలు ఎందుకు చెప్పారని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుల విచారణలో రాత్రి 11:30 గంటలకు నిజం బయటికి వచ్చింది. తానే హత్య చేసినట్టు కోడలు లలిత అంగీకరించింది.. హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను ఆధారంగా ఈ కోడలు అత్తను అమానుషంగా చంపేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.