అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు : ప్రధాని మోదీ
posted on Nov 10, 2025 3:05PM
.webp)
ప్రముఖ రచయిత అందెశ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. అందెశ్రీ మరణం మన సాంస్కతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన ప్రజల పోరాటాలకు ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది అని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు పోరుయాత్రలో చాలా సభల్లో ఆయన పాల్గొనేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు తమ ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించామని గుర్తుచేశారు. అలాగే అందెశ్రీ తనకు సలహాలు కూడా ఇచ్చేవారని కిషన్‌రెడ్డి అన్నారు.