పెన్నా తీరంలో పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయం! ఆనం ఆదేశాలతో పునరుద్ధరణ
posted on: Feb 3, 2026 9:34AM

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమళ్ళపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ఇసుక మేటల కింద కప్పబడిపోయిన పురాతన నాగలింగేశ్వరస్వామి ఆలయం ఇటీవల బయటపడింది. ఆ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఆ సందర్భంగా ఆ ఆలయం మూడువందల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆలయంగా గుర్తించారు. 19వ శతాబ్దినికి చెందిన ఆలయంగా పురావస్తు నిపుణులు నిర్ధారించారు.
వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ ఆలయం ఆలయం ఇసుక మేటల కింద నిక్షిప్తమైందని పేర్కొన్నారు. స్థానిక యువకుల చొరవతో ఆలయ భాగాలు బయటపడినాయి. ఇంత ఘనమైన చరిత్ర గలిగిన దేవాలయం ఇది తెలుగు వారి సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు నిలువెత్తు నిదర్శనమనీ, ఈ అలయ సంరక్షణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలతో అధికార యంత్రాంగం పురాతన నాగలింగేశ్వర స్వామి వారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా పనులు ప్రారంభించారు.



.webp)


