చంద్రకల్ లో విజయనగర కాలం నాటి ఆంజనేయ విగ్రహం
posted on Jan 20, 2025 5:39AM

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం లోని చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వెన్నెల అకాడమీ అధ్యక్షుడు ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన చంద్రకల్ ఆలయం బయట నిర్లక్ష్యంగా పడి ఉన్న క్రి..శ. 16వ శతాబ్ది నాటి ఆంజనేయ విగ్రహాన్ని, ఆలయ ప్రాంగణంలో చిందరవందరగా పడి ఉన్న క్రీ.శ13వ శతాబ్ది నాటి శివలింగాన్ని ఆయన ఆదివారం (జనవరి 19) పరిశీలించారు.
నల్లశానపు రాతిలో యోని ఆకారపు పానవట్టం పైన స్వయంభు శివలింగం నునుపుగా కాకతీయ శిల్ప శైలిలో ఉందని, గ్రైనేట్ రాతిలో చెక్కిన నిలువెత్తు భక్తాంజనేయ విగ్రహం విజయనగర వాస్తు శైలిలో ఉందన్నారు. చరిత్ర ప్రాధాన్యత గల ఈ రెండు కళాఖండాలను ఆలయంలోపల పీటలపై నిలబెట్టి, వాటి చారిత్రక వివరాలతో పేరు పలకలను ఏర్పాటుచేసి భవిష్యత్ తరాలకు అందించాలని ప్రజలకు శివనాగిరెడ్డి ముత్యాల దినకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బడే సాయి కిరణ్ రెడ్డి అద్దంకి రవికుమార్ పాల్గొన్నారు.
.webp)