Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ...టీటీడీ క్షేత్రానికి ఈ-బస్సులు విరాళం!
posted on: Jun 28, 2026 8:21AM

తిరుమలలో భారీ రద్దీ..సోమవారం శ్రీవాణి, వీఐపీ దర్శనాలు రద్దు...
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని, సోమవారం జారీ చేయాల్సిన శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లతో పాటు వీఐపీ సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
శనివారం (జూన్ 27) టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఏఈఓ) వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూన్ నెలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని వెల్లడించారు.
శనివారం నాటికి సుమారు 1.5 లక్షల మంది భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారని, ఆదివారం కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దర్శించుకున్నారు. కలియుగ వైకుంఠనాథుని కొలువులో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) పర్యావరణ అనుకూలమైన భారీ కానుకను అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
శ్రీవారి సేవలో పాల్గొనడానికి ముందు అనంత్ అంబానీ సాంప్రదాయబద్ధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తెల్లవారుజామున అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ పర్యటనలో భాగంగా అనంత్ అంబానీ టీటీడీకి సుమారు 27.5 కోట్ల రూపాయల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులకు సురక్షితమైన, కాలుష్య రహిత రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేవలం బస్సులను విరాళంగా ఇవ్వడమే కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రిలయన్స్ సంస్థే చూసుకోనుంది. ఈ 25 ఈ-బస్సులను నడపడానికి అవసరమైన 50 మంది నైపుణ్యం కలిగిన డ్రైవర్లను నియమించడంతో పాటు, వారి జీతభత్యాలను కూడా పూర్తిగా తామే భరిస్తామని అనంత్ అంబానీ స్పష్టం చేశారు.
దీంతో పాటుగా, తిరుమల కొండపై ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఛార్జింగ్ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వయంగా ఏర్పాటు చేయనుంది. దీనివల్ల శ్రీవారి క్షేత్రంలో కాలుష్య నివారణకు ఎంతో దోహదపడనుంది.
రిలయన్స్ గ్రూప్ తీసుకున్న ఈ ఉదార నిర్ణయంపై టీటీడీ ఉన్నతాధికారులు మరియు అర్చక బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఇలాంటి పెద్ద ఎత్తున సహకారం అందించడం అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు.
తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ తిరుమలగా మార్చాలనే టీటీడీ ప్రయత్నాలకు ఈ ఎలక్ట్రిక్ బస్సుల రాక మరింత ఊతాన్ని ఇవ్వనుంది. భవిష్యత్తులో తిరుమల ఘాట్ రోడ్లలో సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా టీటీడీ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


.webp)



