Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రజినీకాంత్ విషయంలో మమ్ముట్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి?
posted on: Mar 10, 2026 5:47PM
ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. అలాంటి సినిమాలు చరిత్రలో పదికాలాల పాటు నిలిచిపోతాయి. కొన్ని తరాలపాటు ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన ‘దళపతి’ ఒకటి.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో ‘దళపతి’ కూడా ఒకటి. అప్పటికి తమిళ, మలయాళ భాషల్లో సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న రజినీకాంత్, మమ్ముట్టి కలిసి నటించిన ఈ సినిమా ఓ చరిత్ర సష్టించింది. దేవాగా మమ్ముట్టి, సూర్యగా రజినీకాంత్ నటించారు. వీరిద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది, ఆ తర్వాత ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు అని తెలియజెప్పే సన్నివేశాలతో కూడిన ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
కథలోకి వెళ్తే, రమణ అనే రౌడీ దగ్గర ఓ సామాన్యుడు అప్ప్పు చేస్తాడు. ప్రతి నెలా వడ్డీ కడుతుంటారు. బిడ్డ అనారోగ్య కారణంగా వడ్డీ కట్టలేకపోతాడు. దాన్ని అదనుగా చేసుకొని డబ్బు కట్టే వరకు నీ భార్య నా దగ్గరే ఉంటుంది అంటూ ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు. చుట్టూ ఊరి జనం ఉన్నా ఎవరూ నోరు మెదపరు. ఎందుకంటే అతను దేవరాజ్ మనిషి. న్యాయం కోసం ప్రాణాలకైనా తెగించే సూర్య, ఆ అరాచకాన్ని చూస్తూ ఊరుకోడు. దేవరాజు మనిషిని చితగ్గొట్టి ఆ సామాన్యుడికి అండగా నిలబడతాడు.
సూర్య చేసిన పనికి ఆగ్రహించిన దేవరాజు తన మనుషుల్ని పంపి సూర్యను తీసుకు రమ్మంటాడు. వాళ్లు సూర్యని బెదిరించాలని ప్రయత్నిస్తారు. అప్ప్పుడు ‘నన్ను చూడాలనుకుంటే ఆ దేవరాజునే ఇక్కడికి రమ్మను’ అంటాడు సూర్య. దేవరాజు వస్తాడు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న తన మనిషికి ఏదైనా జరిగితే సూర్య ఉండడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు దేవరాజు.
ఇదిలా ఉంటే హాస్పిటల్‌లో రమణ చనిపోతాడు. దీంతో పోలీసులు సూర్యను అరెస్ట్ చేస్తారు. తల్లిదండ్రులు లేని అనాథ సూర్య. పోలీసులు అడిగితే తల్లిదండ్రుల పేర్లు కూడా తెలీదని చెప్తాడు. ఆ సమయంలో తనను అవమానించిన పోలీస్ ఆఫీసర్ని చితక బాదుతాడు. ఆ తర్వాత సూర్యను చిత్ర హింసలకు గురి చేస్తారు పోలీసులు. తను రమణను చంపానంటూ పోలీసులకు లొంగిపోతాడు ఓ వ్యక్తి. అతన్ని దేవరాజు పంపాడు. సూర్యను విడుదల చేస్తారు.
దేవరాజు చేసిన పనికి సూర్య ఆశ్చర్యపోతాడు. ఎందుకలా చేశావని అడుగుతాడు. నువ్వు చేసిన పనిలో న్యాయం ఉందనీ, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు దేవరాజు. తన కోసం అంత చేసిన దేవరాజుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని బాధపడతాడు సూర్య. అలా ఇద్దరూ స్నేహితులుగా మారిపోతారు.
‘సూర్య నా స్నేహితుడు, నా తోడబుట్టినవాడు, నా దళపతి’ అని దేవరాజు అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కాదు, ఒక ఆశయం కోసం కలిసిన రెండు అగ్ని పర్వతాల సంగమం.‘దళపతి’ సినిమాలోని ఈ సన్నివేశం నేటికీ మనలో స్ఫూర్తిని నింపుతుంది. న్యాయం కోసం ఎవరూ లేని అనాధ అయినా సరే, ధైర్యంగా నిలబడితే ప్రపంచమే అతడి వెనుక నడుస్తుందని సూర్య పాత్ర నిరూపించింది. స్నేహం, త్యాగం, మరియు సామాన్యుడి పట్ల బాధ్యత కలిసిన ఈ వీడియోను వీక్షించండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.






