పవన్ ను తక్కువ అంచనా వేశారా...?
posted on: Jan 31, 2018 4:44PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని...ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.
ఇక ఈ పవన్ పర్యటనలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. పవన్ ను అభినందించిన వాళ్ల కంటే... ఆయన్ని తిట్టిన వాళ్లే ఎక్కువ. కానీ పవన్ కు అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్రను ఆయన అభినందించారట. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారట.
ఆశ్చర్యం ఏంటంటే.. అమిత్ షా ఆహ్వానాన్ని పవన్ తిరస్కరించారట. ఆయన ఆహ్వానముపై సమాధానమిస్తూ తాను త్వరలోనే ఢిల్లీ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై ప్రధాని మోడీతో చర్చిస్తానని, అప్పుడు మిమ్ములను కలుస్తానని చెప్పాడట. అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం వెనక ఏదో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అయితే అమిత్ షా పట్ల పవన్ వ్యవహరించిన తీరు అందరికి నవ్వు పుట్టిస్తుంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడే పిలిచినా పవన్ వెళ్లలేదంటే...పవన్ కు ఉన్న స్టామినా ఏంటో మరోసారి చూపించారు. మరి పిలవగానే పేరంటానికి వెళ్లినట్టు అందరి నాయకుల్లా పిలిచి వెంటనే పరుగు పరుగున వెళతారని అనుకున్నారేమో అమిత్ షా.




.jpg)

.webp)



