ఢిల్లీ పేలుడుపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

ఎర్రకోట సమీపంలో  సోమవారం (నవంబర్ 10) జరిగిన  పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం (నవంబర్ 11)  ఉన్నత స్థాయి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘటనపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అమిత్ షా తెలుసుకున్నారు. భద్రతా చర్యలను మరింత బలపరిచే దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దర్యాప్తు పురోగతిలో ఉందనీ, ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవనీ అమిత్ షా చెప్పారు. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో  డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ  డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాఠే హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఇలా ఉండగా  ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో  ఈ పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఎర్రకోట మెట్రో స్టేషన్ ను అధికారులు మూసి వేశారు.  ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్,ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ బృందాలు దర్యాప్తు ప్రారం భించా యి. భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ కు 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేత తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మెట్రో స్టేషన్ ను తెరుస్తామన్నారు. కీలక ఆధారాల సేకరణకు ఇబ్బందులు తతెల్తకూడాదన్న ఉద్దేశంతో తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu