అమిత్ జీ.. ఏంటి ఈ మార్పు..

 

టీడీపీ-బీజేపీకి మధ్య నడుస్తున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితి వచ్చింది రెండు పార్టీల మధ్య. ప్రత్యేక హోదా విషయంలో ఒకపక్క బీజేపీ ఏపీ ఏంతో చేశాం అని అంటుంటే.. మీరు చేసింది ఏం లేదు అని మరోపక్క టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంపై మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇక ఈపని చేసినందుకుగాను.... మోడీ, అమిత్ షా గుర్రుగానే ఉన్నారు. చంద్రబాబునాయుడి సంగతైతే చెప్పక్కర్లేదు.. ఎప్పుడైతే బీజేపీ నుండి విడిపోయారో ఆరోజు నుండి మోడీ, అమిత్ షా పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి చోటుచేసుకుంది.

 

టీడీపీ.. బీజేపీతో విడిపోయిన తరువాత దీనిపై స్పందించిన అమిత్ షా మీ ఇష్టం.. మీరు విడిపోతానంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అని చాలా ఈజీగా చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇక విడిపోయిన తరువాతే అసలు రచ్చ మొదలైంది. దాంతో ఇప్పుడు అమిత్ షాకు తెలుసొచ్చినట్టుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ...ఏపీలో తెదేపాతో తెగదెంపుల తర్వాతే పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైందన్నారు. త్వరలోనే ఏపీ భాజపా అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చేశారని... త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని తెలిపాయి. అంతేకాదు టీడీపీతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ... కూల్ గా స్పందిస్తూ..కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవ లేదని.. పెట్టుకోవాలని కూడా అనుకోలేదని.. మా నుండే చంద్రబాబే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే, అమిత్ షా, విపక్షాల మీద ఇంత సాఫ్ట్ గా మాట్లాడరు. మోడీ-షా పాలన గురించి తెలిసిందే. విపక్షాలను ఎదుర్కోవడానికి ఎంత దూరమైన వెళతారు. అలాంటిది.. అమిత్ షా ఇలా మాట్లాడేసరికి... అమిత్ షా చంద్రబాబుకి ఇన్ డైరెక్ట్గ్ గా సిగ్నల్ పంపిస్తున్నారా అని అనుకుంటున్నారు. మరోపక్క దీనిపై స్పందించిన టీడీపీ నేతలు.... ఇవన్నీ మీడియా ముందు ఎదో హడావిడి అని, కర్ణాటకలో తెలుగువారి ఓట్లు పోకుండా, అమిత్ షా ఎదో కవర్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి అమిత్ షా ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించారో ఆయనకే తెలియాలి మరి..!