Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుటుంబాన్ని హత్య చేసి ఆత్మహత్య.. అమెరికాలో కాల్పుల కలకలం
posted on: Jun 2, 2026 9:16AM
.webp)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి రాక్షసుడిగా మారి కుటుంబ సభ్యులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో నిందితుడితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం మస్కటీన్ నగరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మస్కటీన్ నగరాన్ని ఈ దారుణ ఘటన ఒక్కసారిగా కుదిపేసింది. సోమవారం (జూన్ 1)మధ్యాహ్నం మస్కటీన్‌లోని పార్క్ అవెన్యూలో ఉన్న ఓ నివాస గృహంలో కాల్పులు జరుగుతున్నాయంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రక్తపు మడుగులో తుపాకీ గాయాలతో పడి ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.
పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని మస్కటీన్ నగరానికి చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్‌గా గుర్తించారు. ఆ నలుగురిని హతమార్చిన తర్వాత నిందితుడు మెక్‌ఫార్లాండ్ అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. అతని కోసం పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు మిస్సిసిపీ నది వెంబడి ఉన్న ఒక రివర్‌ఫ్రంట్ ట్రయిల్‌లో నిందితుడు ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. పోలీస్ అధికారులు అతనిని చుట్టుముట్టి, లొంగిపోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే, ఊహించని విధంగా మెక్‌ఫార్లాండ్ తన వద్ద ఉన్న తుపాకీతో స్వయంగా కాల్చుకున్నాడు. పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాలపాలైన నిందితుడిని కాపాడలేకపోయారు. అతడు అక్కడికక్కడే మరణించాడు.
అయితే ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, మరో రెండు వేర్వేరు చోట్ల మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒక మృతదేహం మిల్ స్ట్రీట్‌లోని ఒక నివాసంలో దొరకగా, మరొకటి గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సంస్థ ప్రాంగణంలో పడి ఉంది. ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే, చనిపోయిన ఆరుగురు వ్యక్తులు కూడా నిందితుడైన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్ కుటుంబ సభ్యులే. కుటుంబ తగాదాల కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తేలింది. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.






