Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు సీఎం విజయ్ నివాసం నీలాంకరి నుంచి వేదనియలంకు మార్పు.!?
posted on: Jul 14, 2026 2:36PM

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. వేద నిలయంను తన నివాసంగా చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంలోకి మారేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివాసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జె. జయలలిత అధికారిక నివాసం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వేదనిలయాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు. . పోయెస్ గార్డెన్ (Poes Garden) లో ఉన్న ఈ చారిత్రాత్మక బంగ్లాను 350 కోట్లకు కొనుగోలు చేసి, ఆ భవనాన్ని తన నివాసంగా మార్చుకు ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు రాష్ట్ర అధికార కేంద్రంగా, కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచిన వేద నిలయం ఇప్పుడు కొత్త రాజకీయ శకానికి సాక్ష్యంగా నిలవబోతుందా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక క్రమశిక్షణ గల పాలకుడిలా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ్.. నీలాంకరి నుంచి ప్రతిరోజూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయెస్ గార్డెన్‌లోకి మారాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వేద నిలయం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని జయలలిత ఆమె తల్లి సంధ్యతో కలిసి 1967 జూలైలో కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 1968 మే 15న గృహప్రవేశం చేసిన నాటి నుంచి 2016 డిసెంబర్‌లో ఆమె కన్నుమూసేంత వరకు ఈ నివాసమే తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అయితే జయలలిత మరణానంతరం ఈ ఇల్లు న్యాయవివాదాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చినా.. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసులైన జె. దీప, జె. దీపక్‌లకు అప్పగించింది. ఇప్పుడు విజయ్ ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధమై ఆ వారసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
poes garden house, jayalalithaa veda nilayam buying, vijay buy jaya home 350 crore, thalapathy vijay new residence chennai






