అమెరికాకు కొరుకుడు పడని ఇరాన్ మిసైల్ సిటీ.. ఖేష్మ్

posted on: Mar 19, 2026 9:23AM

ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులను తట్టుకుంటూ.. ప్రతిదాడులు చేస్తోంది. గంటలలో ఇరాన్ ను కమ్మేసి అధీనంలోకి తెచ్చుకుందామనుకున్న అగ్రరాజ్యం వ్యూహాలు ఘోరంగా విఫలమయ్యాయి. అమెరికాను దీటుగా ఎదుర్కొంటూ.. గల్ఫ్ దేశాలలోని అగ్రరాజ్యం మిలిటరీ స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేయగలుగుతోందంటే అందుకు కారణం ఖేష్మ్ ద్వాపం. ఇరాన్ మిసైల్ సిటీ.   

 పకృతి సిద్ధమైన అద్భుతాలకు నిలయంగా, పర్యాటక స్వర్గధాంగా విలసిల్లే ఈ ఖేష్మ్ ద్వీపం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.  ఒకప్పుడు  పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రాంతం..  ఇప్పుడు ఇరాన్  అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ గా ఆ దేశ రక్షణ కవచంగా మారింది.  హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్నఖేష్మ్ ప్రస్తుతం ఇరాన్ సైనిక వ్యూహ కేంద్రం. ఇరాన్ పై యుద్ధంలో అమెరికా పై చేయి సాధించకుండా అడ్డుగా నిలబడుతున్నది ఈ ఖేష్మ్ ద్వీపమే. అమెరికా ఇరాన్ పై యుద్దంలో పై చేయి సాధించాలంటే ఖేష్మ్ కోటను ఛేదించాలి. ఖేష్మ్ లోని సహజసిద్ధమైన గుహలను ఇరాన్ తన క్షిపణి గిడ్డంగులుగా మార్చుకుంది.

  సముద్ర మట్టానికి వందల అడుగుల లోతులో, పర్వతాల లోపల నిర్మించిన ఈ రహస్య స్థావరాలు   అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను ప్రతిఘటించే విషయంలో అత్యంత కీలకంగా మారాయి. హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంగా ఉన్న ఈ ప్రదేశం అమెరికా వ్యూహాలను దారుణంగా దెబ్బతీస్తున్నది. హర్మూజ్ జలసంధి  ప్రపంచ చమురు రవాణాను అడ్డుకోవడానికీ,   శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి  ఇరాన్ కు ఇది ఒక అభేధ్యమైన కోటగా ఉపయోగపడుతోంది.  

ఇక్కడి నుంచి ప్రయోగించే క్షిపణులు నిమిషాల వ్యవధిలో లక్ష్యాలను ఛేధిస్తున్నాయి.   ఈ నెల 7న అమెరికా ఖేష్మ్ లోని ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై అమెరికా దాడులు చేసి దానిని ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ గంటల వ్యవధిలో  బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరంపై భీకర దాడి చేసి సత్తా చాటడం విశేషం. ఇక అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలంటే.. ఇరాన్ కు పెట్టని కోట లాంటి ఖేష్మ్ ను ఛేదించాలి. ఆ దిశగా అమెరికా దాడులు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదని పరిశీలకులు అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...