Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్‌పై అమెరికా ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్.. కొత్త పేరుతో దాడులకు సమాయత్ం!
posted on: May 14, 2026 7:12AM

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణల మధ్య, ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్ అనే పేరుతో భారీ సైనిక చర్యకు ఉపక్రమించనుంది.
గత కొద్ది కాలంగా ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆపరేషన్ పెద్దగా ఫలించలేదు. పైపెచ్చు అమెరికా వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి ప్రస్షుటమంది. దీంతో ఈ ఆపరేషన్ పేరు మార్చి మరింత పదునైన వ్యూహాలతో, మరింత తీవ్రమైన దాడులను చేపట్టాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుతం ఇరాన్ తో కాల్పుల విరమణ విఫలం అవుతున్న నేపథ్యంలో ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్ పేర భారీ ఎత్తున వైమానిక, క్షిపణి దాడులు చేపట్టేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది.
ఈ పేరు మార్పు వెనుక కేవలం వ్యూహాత్మక కారణాలతో పాటు.. చట్టపరమైన అంశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం.. ఏదైనా సుదీర్ఘ యుద్ధం కోసం కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అయితే, కొత్త ఆపరేషన్ పేరును తెరపైకి తేవడం ద్వారా, ఇది ఒక కొత్త సైనిక చర్య అని వాదిస్తూ కాంగ్రెస్ ఆమోదం పొందే గడువును మరింత పెంచుకోవచ్చని ట్రంప్ యోచనగా పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడం, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అవసరమైతే ఆత్మరక్షణ కోసం దాడులు చేసేందుకు తాము వెనుకాడబోమని ఇటీవల స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి ఏ చిన్నపాటి కదలిక వచ్చినా, ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్ పేరుతో ఆ దేశ అణు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగే అవకాశం ఉందంటున్నారు.



.webp)


