Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచు తుపాను ధాటికి చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం
posted on: Jan 27, 2026 11:40AM
.webp)
అగ్రరాజ్యం అమెరికాను పెర్న్ మంచుతుపాను గడగడలాడిస్తోంది. భారీ హిమపాతంతో అమెరికాలోని దాదాపు 40 రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ తుపాను ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. తీవ్రమైన చలికి తట్టుకోలేక వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 29 మంది మరణించారు. మంచు బరువుతో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో పలు రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్లు దెబ్బతిని విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. మంచు తుఫాను కారణంగా ఇప్పటి వరకు 19 వేల విమానాలు రద్దయ్యాయి. ప్రయాణీకులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి నానా ఇబ్బందులూ పడుతున్నారు. దాదాపు 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు.






