Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మార్గదర్శి ఉషా చిలుకూరి వాన్స్!
posted on: May 14, 2026 6:47AM

చిలుకూరి ఉషా వాన్స్.. అమెరికా రాజకీయ యవనికపై ఇప్పుడీ పేరు మార్మోగిపోతున్నది. ఉషా చిలుకూరి అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి. . సాధారణ తెలుగు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంలో సెకండ్ లేడీ హోదా చేరుకోవడం వెనుక కృషి, పట్టుదల, మేధస్సు ఉన్నాయి. ఆమె ప్రయాణం.. ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయులకు, మరీ ముఖ్యంగా తెలుగు వారికి ఇదొక గర్వకారణమైన విషయం.
ఉష చిలుకూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వడ్లూరు గ్రామం. ఆమె తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో, చిన్నతనం నుంచే ఆమెకు చదువుపై మక్కువ పెరిగింది. అమెరికాలోనే పుట్టి పెరిగినప్పటికీ, ఉషా చిలుకూరి భారత సంస్కృతిని, విలువలను ఎప్పుడూ మర్చిపోలేదు. యేల్ యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలోనే ఆమెకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా చిగురించి వారి వివాహానికి దారి తీసింది. . సపోజ్ ఉపను వివాహం చేసుకోలేకపోయి ఉంటే.. తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయి ఉండేవాడినని వాన్స్ అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. వాన్స్ ఎదుగుదలలో ఉషా చిలుకూరి వాన్స్ పాత్ర ఎంత ఉందన్నది. . జేడీ వాన్స్ రాసిన సుప్రసిద్ధ పుస్తకం హిల్‌బిల్లీ ఎలిజీ లో తన జీవితంలో ఉష పాత్ర ఎంత కీలకమో కళ్లకు కట్టినట్లు వివరించారు వాన్స్. తన జీవితంలోని కష్టకాలంలో ఉష తనకు ఎలా అండగా నిలిచింది, తన ఆలోచనా దృక్పథాన్ని ఎలా మార్చింది ఆయన ఆ పుస్తకంలో వివరించారు.
జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎదిగే క్రమంలో ఉష చిలుకూరి వెనుక ఉండి నడిపించే ఒక శక్తి. ఉష కేవలం అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య మాత్రమే కాదు.. ఆయన మార్గదర్శి కూడా. అంతే కాదు, ఆమెకు తనదంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సాధించారు. యేల్ లా స్కూల్‌లో ఎంతో ప్రతిభ కనబరిచిన ఉష, సుప్రీం కోర్టు క్లర్క్‌గా కూడా పనిచేశారు. ఆమె విద్యా నేపథ్యం, వృత్తిపరమైన విజయాలు అమెరికాలోని భారతీయ సంతతికి స్ఫూర్తిగా నిలుస్తాయి.
తెలుగు మూలాలు కలిగిన మహిళగా, అమెరికా వంటి అగ్రరాజ్యంలో అత్యున్నత పదవులకు చేరువ కావడం గొప్ప విషయం. ఆమె భర్త జేడీ వాన్స్ విజయాల్లో ఆమె వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. వారి అనుబంధం, పరస్పర అవగాహనా వారిని ఐడియల్ కపుల్ గా నిలబెట్టాయనడంలో సందేహం లేదు. జేడీ వాన్స్ స్వయంగా ఉషను తన ఆధ్యాత్మిక మార్గదర్శిగా అభివర్ణిస్తారు. సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక రంగాల్లో రాణించడం ఎలా అంటే ఎవరైనా సరే ఉషా చిలుకూరి వాన్స్ ను చూపిస్తారు.


.webp)


