దిగి వచ్చిన ట్రంప్.. భారత్ పై టారిఫ్ లు తగ్గింపు

posted on: Feb 3, 2026 9:48AM

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దిగి వచ్చారు. భారత్ పై సుంకాలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ సుంకాల యుద్ధానికి వెరవకుండా భారత్ ఆత్మనిర్భర్ నినాదంతో ముందుకు సాగుతుండటంతో ట్రంప్ కు దిగి రాక తప్పలేదు.

తాజాగా భారత్ పై గతంలో విధించిన ప్రతీకార టారిఫ్ లను పాతిక శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.  ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ తాజాగా ఫోన్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ సంభాషణ అనంతరం ట్రంప్ నుంచి టారిఫ్ తగ్గింపు ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ట్రంప్ తన పోస్టులో.. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత ప్రధాని  మోడీ అంగీకరించారని పేర్కొన్నారు. అమెరికా వెనిజువెలా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసేందుకు మోడీ ఆసక్తి కనబరిచారన్న మోడీ అందుకే భారత్ పై టారిఫ్ లు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.  అయితే ఈ విషయంపై భారత్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...