Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ యురేనియం.. ట్రంప్ స్కెచ్.. హైరిస్క్!
posted on: Mar 30, 2026 3:18PM
.webp)
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం అయ్యారు. అయితే, అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఏమంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇరాన్ నాయకులు బాహాటంగానే అమెరికా 15 సూత్రాల శాంతి ప్రతిపాదనను ఎద్దేవా చేశారు. అయినా కూడా అంతర్జాతీయ చమురు ఓడల రవాణాకు ఇరాన్ హర్మూజ్ సలసంధిని ఓపెన్ చేయడాన్ని అగ్రరాజ్యాధినేత ఇరాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇరాన్ చాలా గొప్ప దేశం అంటూ కితాబిచ్చారు. అదే సమయంలో ట్రంప్ ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న దాదాపు 970 పౌండ్లు అంటే 400కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా తన తాజా కథనంలో పేర్కొంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉండకూడదని భావిస్తున్న ట్రంప్ చర్చల పేరుతో ఆ యురేనియంను అధినంలో కి తీసుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా పేర్కొంది.
ఇరాన్‌తో చర్చలు జరిపి యురేనియాన్ని తీసుకోవాలని చూస్తున్నారనీ, సపోజ్ ఫర్ సపోజ్ ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే.. బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య రాజీ కుదుర్చేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే దేశాలు ఇరాన్, అమెరికాల మధ్య రాజీకి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. రాజీ చర్చలు ఫలితాలను ఇవ్వకపోతే ట్రంప్ తన ప్లాన్‌ను అమలు చేసే అవకాశం ఉందంటున్నారు.
అయితే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనదని అగ్రరాజ్యానికి చెందిన మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అమెరికా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళితే ఇరాన్ నుంచి మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ చర్యల వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగడం వినా మరో ప్రయోజనం ఉందని కుంబడద్దలు కొడుతున్నారు. యూరేనియం స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్లాన్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని, దానికి రోజులు, వారాల సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.






