అమెరికా షట్ డౌన్ ఎత్తివేస్తూ బిల్లుపై ట్రంప్ సంతకం
posted on: Nov 13, 2025 8:36AM

అమెరికా లో 43 రోజుల ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది. షట్‌డౌన్ క్లోజ్ చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా ఆమోదించింది. ఈ ఓటింగ్ లో 222-209 ఓట్ల తేడాతో షట్‌డౌన్ ఎత్తివేత బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది.
అమెరికా అధ్యక్షుడు షట్ డౌన్ ఎత్తివేత ఫైలుపై సంతకం చేశారు. ప్రభుత్వం షట్‌డౌన్‌తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది. వేతనాలు లేకుండా పని చేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు షట్ డౌన్ ఎత్తివేస్తూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ సంతకం చేయడంతో అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినట్లేనని అంటున్నారు. అయితే ఈ ఎత్తివేత ఆమెదం బిల్లు ద్వారా వచ్చే ఏడాది జనవరి 30 వరకు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధులను మాత్రమే కల్పిస్తుంది. ఆ తరువాత మరోసారి అమెరికా షట్ డౌన్ అయినా ఆశ్చర్యం లేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.






