Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచ వాణిజ్యానికి అమెరికా సెక్యూరిటీ కాదు.. హెర్మూజ్ రక్షణ నాటో దేశాలదేనన్న ట్రంప్
posted on: Apr 10, 2026 9:58AM

నాటో దేశాలపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హెర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో నాటో దేశాల తీరును తప్పుబట్టారు. హెర్మూజ్ భద్రత కోసం అమెరికా భారీగా నిధులు వెచ్చిస్తోందనీ, అయితే.. ఆ జల సంధి వల్ల ప్రయోజనం పొందుతున్న నాటో దేశాలు మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా అమెరికా బాధ్యత మోస్తోందన్న అమెరికా అధ్యక్షుడు.. నాటో దేశాల తీరు సరికాదని అన్నారు.
ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు.
గత కొంతకాలంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి భద్రత అంతర్జాతీయ సమస్యగా మారిందన్న ట్రంప్.. నాటో దేశాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. హెర్మూజ్ భద్రత అమెరికా కు కాదనీ, నాటో దేశాలకే ఎక్కువ అవసరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలు తమ చమురు అవసరాల కోసం ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయనీ.. కాబట్టి ఆయా దేశాలే తమ నౌకలకు రక్షణ కల్పించుకోవాలని అన్నారు. తమ సైన్యం ఉచితంగా ప్రపంచ వాణిజ్యానికి కాపలా కాయడం ఇంకానా ఇకపై ఉండదన్న సంకేతాన్ని ట్రంప్ ఇచ్చారు.
ట్రంప్ మాటలను బట్టి ముందు ముందు హెర్మూజ్ జలసంధి రక్షణకు సంబంధించి అమెరికా తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ నాటో దేశాలు స్పందించకుండా హెర్మూజ్ ప్రాంతం నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.






