Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ తో యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చెంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఖాయం.!
posted on: Jul 22, 2026 8:51AM

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంతో అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ యుద్ధం కోసం, యుద్ధాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుస్తే మైండ్ బ్లాక్ కావడం ఖయం. ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో 3.6 లక్షల కోట్లు. పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో నిరంతరం సాగుతున్న రాకెట్లు, డ్రోన్లు, క్షిపణి దాడులు అమెరికా ఖజానాను దాదాపుగా ఖాళీ చేస్తున్నాయి. అలాగే అమెరికా రక్షణ రంగాన్ని ఈ యుద్ధం డిఫెన్స్ లో పడేసింది. అమెరికా అహంకారంలోని డొల్ల తనాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటింది.
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట స్వయంగా హాజరై ఇరాన్ తో యుద్ధం కోసం ఎంత వ్యయం చేయాల్సి వచ్చిందో గణాంకాలతో సహా వెల్లడించారు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ యుద్ధ వ్యయం ఇంకా భారీగా పెరుగుతుందని కూడా ఆయన అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట అంగీకరించారు. మే, జూన్ నెలల్లో వేసిన అంచనాల ప్రకారం ఈ వ్యయం 29 బిలియన్ల నుంచి 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావించినా.. అది వాస్తవంగా 37.5 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. యుద్ధ తీవ్రత, క్షిపణుల వాడకం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు.
రక్షణ అవసరాలు, ఆయుధ రీప్లేస్‌మెంట్ కోసం అత్యవసరంగా మరో 67 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ నిధులను కేటాయించాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌తో కలిసి పీట్ హెగ్‌సెత్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున సెనేట్‌ను అభ్యర్థించారు. సైనిక బలగాల సంసిద్ధతను కాపాడుకోవడానికి నిధులు అత్యవసరమన్నారు. నిధులు వెంటనే మంజూరు కాకపోతే, అమెరికా సైనిక శిక్షణా కార్యక్రమాలను పరిమితం చేయాల్సి వస్తుందనీ, ఇంు వల్ల నిర్వహణ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Pete Hegseth US Iran war, US military spending Iran, Strait of Hormuz conflict, Pentagon defense budget






