ఇరాన్ పై అమెరికా ద్వంద్వ వైఖరి

posted on: Apr 9, 2026 3:46PM

ఇరాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనే ధ్యేయం అంటే ఓ పక్క శాంతి మంత్రం పఠాస్తూనే.. మరో వైపు ఇరాన్ ను రెచ్చగొట్టి పశ్చిమాసియాలో శాంతికి అవకాశం లేకుండా చేస్తున్నాది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు. అదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి   పీట్ హెగ్‌సెత్ ఇరాన్ పై అమెరికా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా ఎటువంటి చర్యలకూ వెనుకాడబోదని కుండబద్దలు కొట్టారు.  కేవలం చర్చలతోనే సమస్యలు పరిష్కారం కావని, ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...