షుగర్ వ్యాధిగ్రస్తులకు అమెరికా వీసా లేదు..ఇదెక్కడి ట్రంపరితనం దేవుడా!
posted on Nov 8, 2025 1:49PM

ఇది సమంజసమేనా? షుగర్ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు ఎక్కడ లేరు? అమెరికా నిండా ఊబకాయులే దర్శనమిస్తారు మనకు. అంతగా అమెరికా తగిన పని పాట లేక ఊబకాయులతో నిండి పోయిందని చెబుతాయి అక్కడి జన జీవన దృశ్యాలు.
హైదరాబాద్ కి డయాబిటిస్ క్యాపిటల్ గా పేరుంది. అలాగని హైదరాబాద్ గ్రోత్ ఎక్కడైనా ఆగిపోయిందా? హైదరాబాద్ లో షుగర్ ఉన్న వాళ్లెవరూ పని చేయడం లేదా? ఇక్కడెవరికీ ఉద్యోగాలు రావడం లేదా? ఆయా యాజమాన్యాలు వీరికి జాబ్స్ ఇవ్వడం లేదా?
షుగర్ అన్నది లైఫ్ స్టైల్లో ఒక భాగం. ఫుడ్ కల్చర్ ద్వారా వస్తుంది. పని ఒత్తిడిలో ఆహారం ఆలస్యంగా తీస్కున్నా, జంక్ ఫుడ్ అధికంగా తీస్కున్నా.. ఊబకాయంతో పాటు షుగర్ కూడా వస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఇండియాలో కూడా ఫుడ్ అవేర్నెస్ బాగా పెరిగింది. ఆపై మిల్లెట్ ఫుడ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. దీంతో ఊబకాయం, దాని ద్వారా వచ్చే షుగర్ కంట్రోల్ చేసుకునే యత్నం ఒక యజ్ఞంలా సాగుతోంది.
దొరికిందే సందుగా భావించి ఇలా ప్రతి చిన్న విషయాలకూ వీసాలు ఇవ్వనని మారం చేయడం అన్నది అమెరికాకే అత్యంత ప్రమాదకరం. కారణమేంటంటే, అమెరికాలో పని చేయగలిగిన వయసుగల వారి శాతం బాగా తక్కువ. దానికి తోడు ట్రంప్ తుగ్లక్ చర్యల కారణంగా.. 1960ల కాలం తర్వాత వలస బాగా తగ్గిందని చెబుతున్నాయి అక్కడి గణాంకాలు. ఈ క్రమంలో ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల.. మరింత వలస తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. దీని ద్వారా అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటు పడే ప్రమాదం కనిపిస్తోంది.
ఇప్పటికే హెచ్ 1 బీ వీసా మీద లక్ష డాలర్ల ఫీజు అంటూ దాడి చేసి ఆ తర్వాత దాన్ని సవరించారు.. ఇప్పుడు చూస్తే బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్న వారికి కూడా వీసా ఇవ్వమని అంటే నష్టం వారికి కాదు అమెరికాకే ఎక్కువ కలుగుతుందన్న మాట వినిపిస్తోంది. షుగర్ ఏమంత చెడ్డ రోగం కాదు. దాని ద్వారా ఇక్కడెవరూ ప్రాణాలు కోల్పోవడం లేదు. అందుకంటూ కూడా కొత్త మందులు వచ్చేశాయ్ కూడా. కాబట్టి షుగర్ ఈజ్ నాటే డేంజరస్ డిసీజ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ కమ్ ఫుడ్ హ్యాబిట్స్. వీటిపై దృష్టి సారిస్తే చాలు మొత్తం దానికదే సర్దుకుంటుంది.