Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి!
posted on: Jun 16, 2026 9:31AM

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ ప్రమాదం అమెరికా వైమానిక దళాన్ని, అంతర్జాతీయ రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది రక్షణ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఎయిర్‌బేస్ రన్‌వేపైనే ఈ భారీ యుద్ధ విమానం కుప్పకూలింది.
సాధారణ టెస్ట్ మిషన్‌లో భాగంగా ఈ భారీ బాంబర్ విమానం రన్‌వే నుంచి గాల్లోకి టేకాఫ్ అయింది. అయితే.. టేకాఫ్ నిముషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వే సమీపంలోనే అత్యంత వేగంగా భూమిని ఢీకొట్టింది. విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన, నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వైమానిక దళ రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిం చినప్పటికీ లాభం లేకపోయింది.
412వ టెస్ట్ వింగ్ డిప్యూటీ కమాండర్ కల్నల్ జేమ్స్ హేస్ ఈ ఘోర ప్రమాదాన్ని ధ్రువీకరించారు. విమానం ప్రమాదానికి గురైందని, లోపల ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదనీ పేర్కొన్నారు. మరణించిన ఆ ఎనిమిది మందిని గొప్ప అమెరికన్లు గా అభివర్ణిస్తూ వారికి నివాళులర్పించారు. మృతుల్లో అమెరికా సైనిక సిబ్బందితో పాటు, రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నారు.
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. అమెరికా ఎయిర్ ఫోర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాడార్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ విమానం ప్రయోగాత్మక ప్రయాణం చేస్తోంది. యుద్ధ విమానాల్లో అత్యంత కీలకమైన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే ఏఈఎస్ఏ అనే సరికొత్త అత్యాధునిక రాడార్ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ అత్యున్నత సాంకేతిక రాడార్ టెస్టింగ్ సమయంలోనే విమానం నియంత్రణ కోల్పోయి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్వేషించడానికి అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. . అణు ఆయుధాలతో పాటు సంప్రదాయ ఆయుధాలను భారీ మొత్తంలో మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న బీ 52 యుద్ధ విమానాలు దశాబ్దాలుగా అమెరికా వైమానిక శక్తికి వెన్నెముకగా నిలిచాయి.


.webp)



