రాజమహేంద్రవరం జైలు నుంచి గుంటూరుకు అంబటి తరలింపు

posted on: Feb 12, 2026 9:19AM

సంక్రాంతి వసూళ్ల కేసులో  అంబటి రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరుకు తరలించారు.   పాత కేసులో అంబటికి బెయిల్ వచ్చి గురువారం (ఫిబ్రవరి 12) విడుదల కావాల్సి ఉంది. ఆయనకు బెయిలు మంజూరైనట్లు తెలియగానే వైసీపీ సంబరాలు చేసుకుంది. గుంటూరులోని అంబటి నివాసం వద్ద పటాసులు పేల్చి హడావుడి చేసింది.

చెరసాలలు, దౌర్జన్యాలు వెలుగును ఆపలేవంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. కానీ బెయిలు వచ్చినా ఆయన విడుదలకు అవకాశం లేకుండా పోయింది. ఒకటా రెండో దాదాపు 40 కేసులలో అంబటి నిందితుడిగా ఉండటంతో, ఒక కేసులో బెయిలు వస్తే.. మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యే పరిస్థితి ఉంది. అంబటి పట్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ.. అంబటిపై వైసీపీ హయాంలో నమోదైన కేసులోనే ఇప్పుడు పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో వైసీపీ ఆరోపణలలో పస లేకుండా పోయిందని పరిశీలకులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...