Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబటి పాదయాత్ర హాల్ట్.. కారణం ఏంటో తెలుసా?
posted on: Aug 6, 2026 4:01PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని ఆ పార్టీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకూ రెండు రోజులు వినతి యాత్ర పేరిట అంబటి రాంబాబు తలపెట్టిన పాదయాత్ర చివరి నిముషంలో రద్దైంది. పైకి రద్దు కాదు తాత్కాలిక వాయిదా అని చెబుతుంటే.. తన అనుమతి లేకుండా పాదయాత్రా అంటూ జగన్ కన్నెర్ర చేయడం వల్లే అంబటి తన పాదయాత్రను రద్దు చేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
తన ఇంటిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ అంబటి ఈ పాదయాత్ర తలపెట్టారు. కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
అంబటి రాంబాబు తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే పాదయాత్ర ప్రకటన చేశారని జగన్ భావించారని అంటున్నారు. ఇలా సొంత ప్రయోజనాలు, గుర్తింపు కోసం పాదయాత్రలూ, ఆందోళనలూ చేపట్టడం ఏమిటని అంబటిని నిలదీసినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం రూపొందించిన కార్యక్రమాలకే పరిమితం కావాల తప్ప.. ఇలా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాదయాత్రలు, ఆందోళనలు కూడదని నిష్కర్షగా చెప్పడంతో అంబటి తన పాదయాత్రను విరమించుకున్నట్లు సమాచారం. అయితే జగన్ ఆగ్రహం గురించి బయటకు చెప్పుకోలేక.. డీఎస్సీ నిరసనలకు పార్టీ హైకమాండ్ పిలుపు నివ్వడంతో వాటికి తన పాదయాత్ర అడ్డం కాకూడదన్న ఉద్దేశంతోనే తాత్కాలికంగా విరమించినట్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.
Ambati Rambabu Padayatra canciled, Ambati Vinathi Yatra, Ambati Rambabu Protest Postponed, AP Politics, DGP Office March, Telugu One






