Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబటి సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు.!
posted on: Aug 12, 2026 5:20PM

గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నూరి ఫాతిమా సహా 17 మంది నాయకులు, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల 10వ తేదీన గుంటూరు శంకరవిలాస్ సెంటర్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మెగా డీఎస్సీ నియామకాల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శిస్తూ చేపట్టిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం కూడదని స్పష్టం చేశారు. అంతే కాకుండా గుంటూరు నగరంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ప్రదర్శనలకూ అనుమతి లేదని పేర్కొంటూ.. నిరసన కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది, దీంతో అరండల్ పేట పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించడం, పోలీసుల అధికారిక ఆదేశాలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి నేరాల కింద ఈ కేసు నమోదు చేశారు.
Ambati Rambabu, police Case Guntur, Modugula Venugopal Reddy, YSRCP Leaders, Mega DSC Protest, Guntur Rally






