Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబటి చెప్పిన లోకేష్ అన్న ప్రాశన కథలు!
posted on: May 18, 2026 5:31PM
.webp)
అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు... ఇలాంటి వెటకారాలు, పాత కథలు, ప్రాసలతో కూడిన సెటైర్లు ఖచ్చితంగా పేలుతాయి. అన్నప్రాసన రోజు లోకేష్ బంగారం, పుస్తకం కాకుండా డబ్బులు పట్టుకున్నారంటూ మేనమామ హరికృష్ణ చెప్పినట్టుగా ఒక పాత ముచ్చటను కూడా లాగి, దాన్ని ప్రస్తుత రాజకీయాలకు లింక్ చేయడం అంబటి మార్కు పొలిటికల్ కామెడీ.
ఇక వైసీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. ఆర్టీసీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు/ఆసుపత్రుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి చూస్తోందని అంటారు వీరు. ఇలా చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వ పెద్దలకు లాభం చేకూరుతుందని, అందుకే లోకేష్ పేరుకు లవ్ క్యాష్ అనే ట్యాగ్ లైన్ పక్కాగా సరిపోతుందని సెటైర్ వేస్తున్నారు అంబటి రాంబాబు.
ప్రభుత్వం ఎక్కడా ఆర్టీసీని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం లేదని, కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్ ద్వారా మేనేజ్‌మెంట్ మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని చెబుతున్నారు కూటమి నేతలు.
ఒకప్పుడు లోకేష్‌ను ఇలాగే ట్రోల్ చేశారని, కానీ ఇప్పుడాయన మంత్రిగా రాయల్ ఎన్‌ఫీల్డ్, కియా విస్తరణ, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావడంలో బిజీగా ఉన్నారని... ఇలాంటి పాత జోకులతో ప్రతిపక్షం కాలక్షేపం చేస్తోందని రివర్స్ కౌంటర్ ఇస్తున్నాయి టీడీపీ శ్రేణులు.
ఏదేమైనా, ఒకప్పుడు అసెంబ్లీలో.. సంక్రాంతి డ్యాన్సులు, పాటల విషయంలో అంబటి రాంబాబును టీడీపీ టార్గెట్ చేస్తే... ఇప్పుడు అంబటి లోకేష్ అన్నప్రాసన కథల తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ క్యాష్ వర్సెస్ లోకేష్ డైలాగ్ వార్ ప్రస్తుతానికి బాగానే వైరల్ అవుతోంది.






