అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
posted on: Feb 4, 2026 8:13PM
.webp)
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంబాబు ఇల్లు, ఆఫీస్‌ను సందర్శించి, కారును ఏ విధంగా ధ్వంసం చేశారో పరిశీలించారు. అంబటి కుటుంబానికి ఓదార్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు.
ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు.. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను సూచిస్తున్నాయని జగన్ విమర్శించారు. అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై మాజీ సీఎం స్పందించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నెయ్యిలో కొవ్వు కలిసిందనేది అసత్య ప్రచారమని, అదే నిజమైతే సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల పేర్లు ఎందుకు లేవని జగన్ ప్రశ్నించారు






