జగన్ తో అంబటి భేటీ

posted on: Feb 20, 2026 2:24PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిలుపై విడుదల అయిన తరువాత అంబటి జగన్ తో భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి అంబటి శుక్రవారం (ఫిబ్రవరి 20) వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంబటి తనపై ప్రభుత్వం పెట్టిన  కేసులను వివరించారు.

అలాగే గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు.  ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. అంబటితో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కూడా జగన్ ను కలిశారు.   
 

google-ad-img
    Related Sigment News
    • Loading...