Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబరీష్ రాజీనామా..హైడ్రామా..!
posted on: Jun 20, 2016 5:46PM

కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్థరామయ్య చెప్పినట్లుగానే తన మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. తన కేబినెట్‌లోని 34 మందిలో 14 మందిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మంత్రి పదవి పోయినవారిలో సినీనటుడు అంబరీష్ కూడా ఉన్నారు. తనను మంత్రి పదవినుంచి తీసేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. మంత్రి పదవి పోవడంతో అందుకు నిరసనగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే దానిని డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌లో రాజీనామా లేఖ లేదని ఆయన అభ్యంతరం తెలిపారు.
తాను మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీశ్ ఒకే లైన్‌తో పంపిన రాజీనామా లేఖ చెల్లదన్నారు. తిరిగి పూర్తి ఫార్మాట్‌లో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. అయితే అంబరీశ్ కావాలనే ఇలా చేశారా..? లేక రాజీనామా చేయడం సీఎంకు ఇష్టంలేక డిప్యూటీ స్పీకర్‌తో ఇలా చేయించారా..? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు మంత్రివర్గం నుంచి అంబరీష్‌ను తొలగించినందుకు ఆయన మద్ధతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుమట్టారు. ముక్కుసూటి మనస్తత్వం గలవారు, నిజాయితీ ఉన్నవారు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్టర్‌లో వ్యాఖ్యానించారు.



.jpg)


