Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కరిగిపోయిన మంచు శివలింగం.!
posted on: Jul 8, 2026 12:36PM

హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ ఒకటి. సముద్ర మట్టానికి 3 వేల 888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గుహలో ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఈ ఏడాది కూడా.. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం కరిగిపోయింది. మేలో సుమారు ఏడు అడుగుల ఎత్తుతో కనిపించిన మంచు శివలింగం ప్రస్తతం 99 శాతం మేర కరిగిపోయింది. కాగా గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంటోందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లోనే మంచు శివలింగం కరిగిపోతున్న పరిస్థితికి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో తగినంత మంచు కురవకపోవడం, తీవ్రమైన ఉష్ణగాలుల ప్రభావం కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఉండగా.. మంచు శివలింగం కరిగిపోయినప్పటికీ, అమర్‌నాథ్ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు. యాత్రను కొన్ని రోజులు ముందుగానే ప్రారంభించి ఉంటే ఎక్కువ మంది భక్తులకు మంచు శివలింగ దర్శనం లభించేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్.. అలాగే భక్తుల రద్దీ కారణంగా మంచు శివలింగం త్వరగా కరిగిపోతోందని అధికారులు వివరణ ఇచ్చారు. మంచు శివలింగం కనిపించకపోయినా అమర్ నాథ్ యాత్రికుల రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు.
Amarnath Shivling melted, Amarnath Yatra 2026,


(7).webp)
.webp)


