రాష్ట్రపతికి చేరిన అమరావతి బిల్లు

posted on: Apr 6, 2026 3:16PM

ఆంధ్రప్రదేశ్  ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఆ బిల్లు చట్టరూపం దాల్చే దిశగా తుది అడుగుకు చేరింది.   ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ  ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.  

అమరావతి బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింద. ఉభయ సభలూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. వైసీపీ వినా దాదాపు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి సై అన్నాయి. వైసీపీ ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుపై జరిగిన చర్చను మాత్రం బాయ్ కాట్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉన్నది.

పార్లమెంట్‌లో ఉభయ సభలలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లును  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది.  కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి సంతకం చేయడంతోనే  అమరావతి రాజధాని చట్టం  అమలులోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి   తెరపడుతుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...