Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేను కొరుకుడుకి కారణాలు... నివారణ ఎలాగో తెలుసుకుందాం!
posted on: Jun 18, 2019 11:16AM
.jpg)
పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.
కారణాలు:
ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన థైరాయిడ్, డయాబెటిస్, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్ అంటారు.

*ఆయుర్వేద చికిత్సా:
కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజలు:

గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.
* మందార ఆకులు పూలతో

నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.
మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది.
పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి.
పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.
మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు.
ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది.
ఆకుల కషాయంతో సిఫిలిస్ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి.
ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంది.





