Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లల విషయంలో అల్లు శిరీష్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో తగ్గేదేలే..!
posted on: Mar 14, 2026 6:06PM
మెగా మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన చిరకాల స్నేహితురాలు నయనికరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. తాము డేటింగ్‌లో ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి, తమకు పుట్టబోయే పిల్లల గురించి చర్చించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా భాషా సంస్కృతుల పట్ల శిరీష్‌కు ఉన్న గౌరవం ఈ చర్చలో స్పష్టంగా కనిపించింది. తమ పిల్లలు ఇంట్లో కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని తామిద్దరం నిర్ణయించుకున్నట్లు శిరీష్ తెలిపారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇళ్లలో పిల్లలు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని, కానీ తమ ఇంట్లో మాత్రం తెలుగు భాషకే ప్రాధాన్యం ఉండాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు.
నయనిక గురించి మాట్లాడుతూ.. ఆమెలో ఉండే నిజాయితీ అంటే తనకు చాలా ఇష్టమని శిరీష్ చెప్పారు. ఏదైనా విషయం నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుందని, తన సినిమాల విషయంలో కూడా ఆమె ఇచ్చే ఫీడ్‌బ్యాక్ చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమది ‘స్లో బర్న’ లవ్ స్టోరీ అని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకున్నామని తెలిపారు.
Also Read: 75 ఏళ్ల క్రితం రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘పాతాళభైరవి’
వారి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసిందనేది కూడా ఒక ఆసక్తికరమైన కథ. ఒకసారి శిరీష్, నయనిక కాఫీ షాప్‌లో ఉండగా.. ఆ షాప్ యజమానికి చిరంజీవి భార్య సురేఖ (శిరీష్ అత్తమ్మ) బాగా తెలుసట. ఆయన వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పెళ్లి వేడుకలో తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి కూడా శిరీష్ ప్రస్తావించారు. “పెళ్లిలో కొన్ని పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు, కానీ ఆ క్షణాలను ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు” అని బన్నీ చెప్పారట. అన్నయ్య సలహాతో తాను పెళ్లి వేడుకలను ఎంతో ప్రశాంతంగా గడిపినట్లు శిరీష్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం వీరిద్దరూ తమ కొత్త ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. హనీమూన్‌కు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని, ప్రస్తుతానికి వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి పెట్టామని శిరీష్ వివరించారు. పిల్లల పెంపకం, భాషాభిమానం విషయంలో శిరీష్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.





