పుష్ప 2 విడుదల సందర్భంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అరవింద్, నేహారెడ్డి

posted on: May 7, 2026 8:52AM

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ కుటుంబం వెళ్లి పరామ ర్శించింది.  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,  హీరో అల్లు అర్జున్ భార్య నేహా రెడ్డి కలిసి శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలుసుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు  తెలుసుకున్నారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు. మంచి విద్యతో ఆమె భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

సినిమా విడుదల రోజున అభిమానుల భారీ రద్దీ కారణంగా చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ వర్గాలు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...