ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్... విడుదలకు ట్రంప్ ఆదేశం
posted on: Feb 20, 2026 8:47PM
.webp)
అమెరికాలో ఏలియన్స్, అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన రహస్య ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో గ్రహాంతర వాసుల ఉనికిపై దశాబ్ద కాలంగా సాగుతున్న అమెరికన్ల ఉత్కంఠకు తెరపడనుంది.
ప్రజల్లో ఈ రహస్యాల పట్ల ఉన్న ఆసక్తిని తీర్చాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు ట్రంప్. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.. గ్రహాంతరవాసులు ఉన్నారని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై ఒబామా నాడు మాట్లాడుతూ.. 'గ్రహాంతర వాసులు ఉన్నది నిజమే కావచ్చు. కానీ నేనెప్పుడూ వారిని చూడలేదు' అని అన్నారు.
అమెరికాలోని ఏరియా 51లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో ఏలియన్స్ భూమిపై సంచరించినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టం చేశారు. అయితే.. ఈ సమాచారాన్ని ఒబామా బహిర్గతం చేయడాన్ని తప్పుబట్టారు ట్రంప్. క్లాసిఫైడ్ సమాచారాన్ని బయటపెట్టి ఒబామా పెద్ద తప్పుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


.webp)



