Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెబైల్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్!
posted on: May 2, 2026 9:51AM

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఒక ప్రత్యేక అలర్ట్ జారీ అయ్యింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పనితీరును పరీక్షించేందుకు శనివారం (మే 2) ట్రయల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం (మే 2)అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
ఈ డ్రిల్ దేశరాజధాని నగరం ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాల్లో జరుగుతుంది. అయితే సరిహద్దు ప్రాంతాలు, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఈ పరీక్షకు మినహాయింపుగా ఉంటాయని అధికారులు తెలిపారు.ఈ సందేశం కేవలం పరీక్ష కోసం మాత్రమేనని, ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలర్ట్ వచ్చినప్పుడుభయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ముఖ్య సమాచారం వేగంగా ప్రజలకు చేరేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


.webp)



