విమాన ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమేనా!

posted on: Jul 23, 2016 12:37PM

 

నిన్న ఉదయం చెన్నై నుంచి అండమాన్‌కు బయల్దేరిన ఓ విమానం గల్లంతు కావడం దేశమంతా ఆందోళనకు గురించేసింది. ఈ విమానంలో 29మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలుగువారూ ఉన్నారు. విమానపు శకలాల ఆచూకీ ఇంకా తేలలేదు కాబట్టి వీరంతా ఇంకా క్షేమంగానే ఉండిఉంటారన్న ఆశ ఎక్కడో వారి బంధువులలో మిణుకుమిణుకుమంటోంది. కానీ దారి పొడుగునా సముద్రంలోనే ప్రయాణించిన విమానం, ఇక తిరిగి దక్కకపోవచ్చు అన్న భయమే ఎక్కువగా మెదులుతోంది. ఆ భయంతో పాటుగా విమానం గురించి బయటపడుతున్న వివరాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 

- 'ఏఎన్‌32' అనే ఈ రష్యా విమానం దాదాపు 32 ఏళ్ల పురాతనమైన విమానశ్రేణికి చెందినది. ఈ తరహా విమానాలు పాతబడిపోయాయనీ, ఇప్పటి అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయనీ ఎప్పటి నుంచో ఆరోపణలు వినవస్తున్నాయి.

 

- వీటి స్థానంలో రష్యా నుంచి కొత్త విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన దాదాపు దశాబ్ద కాలంగా మూలుగుతోంది.

 

- ప్రమాదానికి గురైన విమానం పరిస్థితి కూడా ఏమంత సజావుగా లేదని తేలుతోంది. ఈ విమానానంలో ఇప్పటికే మూడుసార్లు తీవ్రమైన లోపాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి.

 

- పోర్ట్‌బ్లెయిర్‌ (అండమాన్‌ దీవులు)లోని రక్షణ శాఖకు కావల్సిన సరుకులు తీసుకువెళ్లేందుకు ఈ విమానం బయల్దేరే సమయానికి బంగాళాఖాతం మీద వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉందని కథనాలు వినిపిస్తున్నాయి.

 

ఇదంతా చూస్తుంటే ఒకవేళ విమానం కనుక ప్రమాదానికి గురైందన్న వార్త రుజువయితే, దానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యతను వహించాల్సి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...