అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు

posted on: Jan 29, 2026 1:27PM

మహారాష్ట్ర రా  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్  అంత్యక్రియలు  అధికార లాంఛనాలతో జరిగాయి. బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో  గురువారం (జనవరి 29)  ఆయన అంత్యక్రియలు జరిగాయి. బుధవారం (జనవరి 28)న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే.  ప్రియతమ నేతను కడసారి చూసుకునేందుకు అశేషంగా వచ్చిన ప్రజలతో బారామతి జనసంద్రంగా మారింది.  రాజకీయ ఉద్ధండులు, కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రుల సమక్షంలో.. ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి

 అజిత్ పవార్ పార్థివదేహాన్ని తొలుత బారామతిలోని అహల్యాదేవి ఆసుపత్రి నుంచి ఆయన స్వగ్రామమైన కాటేవాడికి తరలించారు. అక్కడ స్థానికులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని జేడీ మాడ్గుల్కర్‌ ఆడిటోరియానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచిన తర్వాత.. అంతిమ సంస్కారాల కోసం విద్యాప్రతిష్ఠాన్ మైదానానికి తరలించారు.

దారి పొడవునా అభిమానులు పూల వర్షం కురిపిస్తూ,  తమ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.  అజిత్ పవార్‌ కు రాజకీయాలకు అతీతంగా అగ్రనేతలంతా  నివాళులర్పించారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై పాడె మోసి నివాళి అర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, మరో ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే,   మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ ఠాక్రే  తదితరులు పవార్ అంత్యక్రియలకు హాజరయ్యారు.   అజిత్ పవార్ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...