Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్‌లో ఎయిర్‌ట్రంక్ మెగా పెట్టుబడి.. ఏఐ యుగానికి కొత్త మలుపు
posted on: Jun 13, 2026 10:34AM
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాల్లో ఒక కీలక మలుపు దగ్గర దేశం నిలిచింది. ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తున్న హైపర్‌స్కేల్ డేటా సెంటర్ సంస్థ ఎయిర్‌ట్రంక్ భారతదేశంలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ప్రణాళికను ప్రకటించడం, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా స్వాగతించడం.. ఈ మార్పు దిశను మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఈ పెట్టుబడి ప్రణాళికను- భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్‌లో.. ఇప్పటి వరకు ప్రతిపాదిత అతిపెద్ద కార్యక్రమాలలో.. ఒకటిగా పేర్కొంటూ, మోడీ ప్రభుత్వం దీన్ని క్లౌడ్ అండ్ AI గ్లోబల్ హబ్‌గా భారతదేశ స్థానం బలోపేతం చేసే, మెగా బూస్ట్ గా ప్రొజెక్ట్ చేస్తోంది.
ఎయిర్‌ట్రంక్ పెట్టుబడి పరిమాణం. రూ.3 లక్షల కోట్లు – 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం, 2030 నాటికి అమలు లక్ష్యం. ప్రధాని మోడీ వ్యాఖ్య ఎలాంటిదంటే, ఇలాంటి పెట్టుబడులు భారతదేశాన్ని క్లౌడ్ కంప్యూటింగ్, AI రంగాల్లో గ్లోబల్ హబ్‌గా నిలబెడతాయి. ఉపాధి, స్థానిక సరఫరా గొలుసులు, ఆవిష్కరణ ఆధారిత వృద్ధికి ఇవి ప్రేరణగా నిలుస్తాయని అన్నారాయన.
ఇక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా విషయానికి వస్తే.. 2022–23లో జాతీయాదాయానికి 11.74శాతం అందించిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, 2024–25 నాటికి 13.42శాతానికి పెరుగుతుందని ఒక అంచనా. 2014లో 25.15 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు, 2024 జూన్ నాటికి 96.96 కోట్లకు పెరుగుదల – 285శాతం వృద్ధి. 2014లో ఒక్కో GB డేటా ధర రూ.308, 2022 నాటికి రూ.9.34 – డిజిటల్ సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ధరల విప్లవం ఇది.
డిజిటల్ ఇండియా కార్యక్రమం- 2015 ప్రారంభం నుంచి, భారతదేశం డిజిటల్ సాధికారత కలిగిన సమాజం, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో.. ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడం, ప్రభుత్వ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందించడం, ఫిన్‌టెక్, UPI, ఆధార్ ఆధారిత సేవల విస్తరణ – ఇవన్నీ కలిసి ఒక డిజిటల్ బేస్ లేయర్ ను నిర్మించాయి.
తాజాగా, ఇండియా AI మిషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో.. ప్రభుత్వ ప్రోత్సాహం, గ్లోబల్ పెట్టుబడిదారులకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. భారత్ కేవలం వినియోగదారుల మార్కెట్ మాత్రమే కాదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ హబ్ గా కూడా ఎదగాలనే సంకల్పం ఉన్న దేశం. ఈ నేపథ్యంపై, AWS, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు.. ఇప్పటికే భారీ పెట్టుబడులను ప్రకటించాయి.
AWS- 2030 నాటికి క్లౌడ్ అండ్ డేటా సెంటర్ ఇన్‌ఫ్రా కోసం రూ.1.06 లక్షల కోట్లు.. మొత్తం అమెజాన్ పెట్టుబడి కట్టుబాటు 35 బిలియన్ డాలర్లకు పైగా.. గూగుల్ విశాఖపట్నం కేంద్రంగా AI-కేంద్రీకృత డేటా సెంటర్ హబ్‌తో సహా, ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు.
మైక్రోసాఫ్ట్- 2026–2029 మధ్యకాలంలో.. 17.5 బిలియన్ డాలర్లు, భారతదేశంలో అతిపెద్ద హైపర్‌స్కేల్ క్లౌడ్ ఉనికిని లక్ష్యంగా పెట్టుకుని. ఈ పెట్టుబడులపై ఎయిర్‌ట్రంక్ రూ.3 లక్షల కోట్ల ప్రణాళిక సూపర్-స్ట్రక్చర్ లా నిలుస్తోంది. అంటే, భారతదేశం గ్లోబల్ క్లౌడ్ అండ్ AI మ్యాప్‌లో ఒక కోర్ నోడ్ గా మారే దిశలో అడుగులు వేస్తోంది.
ఎయిర్‌ట్రంక్ – లుమినా కొనుగోలు నుంచి.. మెగా ప్రణాళిక వరకు తరచి చూస్తే.. 2026 ఏప్రిల్- లుమినా క్లౌడ్ ఇన్‌ఫ్రా కొనుగోలు వ్యవహారం. ఎయిర్‌ట్రంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి కీలక అడుగు- లుమినా క్లౌడ్ ఇన్‌ఫ్రా కొనుగోలు. ఈ కొనుగోలు ద్వారా.. ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో
సుమారు 600 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్య డెవలప్‌మెంట్ పైప్‌లైన్‌ను ఎయిర్‌ట్రంక్ తన చేతుల్లోకి తెచ్చుకుంది.
రాబిన్ ఖుదా – భారత ప్రభుత్వంతో తొలి సీనియర్ ఎంగేజ్‌మెంట్, లుమినా కొనుగోలు అనంతరం, ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు మరియు CEO రాబిన్ ఖుదా భారతదేశంలో.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మంత్రులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ చర్చల్లో.. ఎనర్జీ & పవర్ యాక్సెస్- రిన్యూవబుల్ ఎనర్జీ సస్టైనబుల్ వాటర్ సప్లై, టాలెంట్ డెవలప్‌మెంట్, స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్ ప్రాసెస్‌లు, స్టేట్–ఫెడరల్ కోఆర్డినేషన్ వంటి అంశాలు.. ప్రధానంగా చర్చకు వచ్చాయి. 2026 జూన్ 5న, ఎయిర్‌ట్రంక్ అధికారిక ప్రకటన ద్వారా.. 2030 నాటికి 3వేల బిలియన్ డాలర్లు అంటే, రూ. 3 లక్షల కోట్లుతో 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం- అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విషయంలో ప్రధాని మోడీ ఎలా స్పందించారంటే, భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగాన్ని పుంజుకుంటోంది... ఇలాంటి పెట్టుబడులు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాలలో ప్రపంచ కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయంటూ, ఎయిర్‌ట్రంక్ పెట్టుబడిని భారత్ డిజిటల్ ఎకానమీ భవిష్యత్తుతో నేరుగా అనుసంధానించారు.
ఎయిర్‌ట్రంక్ వంటి హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పెట్టుబడులు కేవలం ఆర్థిక పరిమాణం వల్లే కాదు, న్యాయపరమైన, రెగ్యులేటరీ కోణంలో కూడా కీలకమైనవి. భారతదేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం- DPDP Act అమలులోకి రావడం, గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లకు.. డేటా లోకలైజేషన్ప్రైవసీ కంప్లయెన్స్, క్రాస్-బోర్డర్ డేటా ట్రాన్స్‌ఫర్ నియంత్రణలు.. వంటి అంశాల్లో స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తోంది.
ఎయిర్‌ట్రంక్ వంటి సంస్థలు, భారతదేశంలో భారీ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించేటప్పుడు..
భారతీయ వినియోగదారుల డేటా, గ్లోబల్ క్లయింట్ల డేటా, రక్షణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో భారత చట్టాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ & ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్
5 GW డేటా సెంటర్ సామర్థ్యం అంటే..
భారీ పవర్ కన్సంప్షన్ కూలింగ్ కోసం.. నీటి వినియోగం ల్యాండ్ యూజ్ అండ్ జోనింగ్ వంటి అంశాలు న్యాయపరమైన, పర్యావరణ పరమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. రాబిన్ ఖుదా స్వయంగా రిన్యూవబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ వాటర్ సప్లై, స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్.. గురించి ప్రభుత్వంతో చర్చించినట్లు వెల్లడించడం, ఈ పెట్టుబడి కేవలం ఫైనాన్షియల్ డీల్ కాదు, రెగ్యులేటరీ & పాలసీ-డ్రైవన్ ప్రాజెక్ట్ అని స్పష్టంగా చూపుతోంది.
ఇందులోని రాజకీయ కోణం చూస్తే, డిజిటల్ ఇండియా – న్యూ వరల్డ్ ఆర్డర్ వాదనను ప్రధాని మోడీ, ఇటీవలి ప్రసంగాల్లో.. రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచ వ్యవస్థ.. ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా నడిపించేందుకు భారత్ సిద్ధమని చెబుతూ, భారతదేశాన్ని గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఎయిర్‌ట్రంక్ పెట్టుబడి- డిజిటల్ ఇండియా ఏఐ మిషన్, మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాక్టికల్ వాలిడేషన్ గా ఉపయోగపడుతోంది. ఇది రాజకీయంగా మోడీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యం అనే వాదనను మరింత బలపరుస్తోంది.
ఇందులోని సామాజిక కోణం ఏంటంటే, డిజిటల్ డివైడ్ తగ్గింపు – కానీ కొత్త అసమానతల ప్రమాదం
గత 11 ఏళ్లలో.. ఇంటర్నెట్ కనెక్షన్లు 25.15 కోట్ల నుంచి 96.96 కోట్లకు- బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు- 6.1 కోట్ల నుంచి 94.92 కోట్లకు గ్రామీణ టెలిఫోన్ కనెక్షన్లు 377.78 మిలియన్ల నుంచి 527.34 మిలియన్లకు
పెరిగిన నేపథ్యంలో, గ్రామీణ–పట్టణ డిజిటల్ డివైడ్ గణనీయంగా తగ్గింది.
భారత్‌నెట్ ద్వారా.. 2.18 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలకు- 6.92 లక్షల కి.మీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్
విస్తరణ, గ్రామీణ భారతదేశాన్ని డిజిటల్ మ్యాప్‌లోకి తెచ్చింది. అయితే, ఎయిర్‌ట్రంక్ వంటి మెగా పెట్టుబడులు.. హై-ఎండ్ AI, క్లౌడ్ సేవలు, కార్పొరేట్ అండ్ గ్లోబల్ క్లయింట్లకు సేవలు
కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉంది. అంటే, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో, విలువ సృష్టి గ్లోబల్ కార్పొరేట్ లెవెల్‌లో జరిగే మోడల్ – దీనిపై సామాజిక చర్చ అవసరం.
ఎయిర్‌ట్రంక్ పెట్టుబడిని.. భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రా మెగా బూస్ట్ గా పలు మీడియా రిపోర్టులు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అయితే ఇందులో మరో ముఖ్యమైన విషయమేంటంటే, డేటా సార్వభౌమత్వం
ఎనర్జీ వినియోగం అండ్ కార్బన్ ఫుట్‌ప్రింట్.. స్థానిక సమాజాలపై ప్రభావం అంటే, ల్యాండ్, వాటర్, పవర్ వంటి అంశాలపై ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఈ పెట్టుబడి.. భారత్‌కు ఆర్థిక, టెక్నాలజీ అవకాశాలతో పాటు.. పర్యావరణ, సామాజిక, రెగ్యులేటరీ సవాళ్లు రెండింటినీ కలిపిన రెండు వైపుల పదునైన కత్తిలా చూడాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక, ఉపాధి ప్రభావం.. ఎయిర్‌ట్రంక్, AWS, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెట్టుబడులు- డేటా సెంటర్ నిర్మాణం, ఎనర్జీ, కూలింగ్, లాజిస్టిక్స్, ఐటీ అండ్ నెట్‌వర్క్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్
వంటి రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి.
పవర్ ఇన్‌ఫ్రా, కన్‌స్ట్రక్షన్.. ఫైబర్ అండ్ నెట్‌వర్క్ ఇన్‌స్టాలేషన్- వంటి రంగాల్లో సస్టైన్డ్ డిమాండ్ను కలిగిస్తాయి. టెక్నాలజీ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్. ఇక భారత్ స్టార్టప్‌లు AI అండ్ ML రీసెర్చ్ ల్యాబ్‌లు, క్లౌడ్-నేటివ్ కంపెనీలు.. ఇవన్నీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఇన్‌ఫ్రా అందుబాటుతో.. లో-లేటెన్సీ, హై-క్యాపాసిటీ సేవలను కాస్ట్-ఎఫెక్టివ్ స్కేలింగ్ అవకాశాలను పొందగలవు. ఇది భారత్‌లో తయారైన AI సొల్యూషన్‌లు – ప్రపంచానికి ఎగుమతి అనే మోడల్‌కు బలమైన బేస్‌ను అందిస్తుంది.
భవిష్యత్తులో.. చర్చకు రాబోయే ప్రధాన ప్రశ్నలు.. డేటా ఎవరిది? భారత వినియోగదారుల డేటా, గ్లోబల్ కార్పొరేట్ డేటా – ఎవరి నియంత్రణలో? పవర్ ఎవరి కోసం? డేటా సెంటర్‌ల కోసం భారీ పవర్ వినియోగం, స్థానిక ప్రజలకు పవర్ అందుబాటు, ధరలపై ప్రభావం? పర్యావరణం ఎంత వరకు? నీటి వినియోగం, కార్బన్ ఎమిషన్స్, స్థానిక ఎకోసిస్టమ్‌పై ప్రభావం? ఈ ప్రశ్నలకు స్పష్టమైన పాలసీ, పారదర్శక రెగ్యులేషన్, ప్రజా భాగస్వామ్యం అవసరం.
ఇది మెగా పెట్టుబడి మాత్రమే కాదు మెగా బాధ్యత కూడా.. ఎయిర్‌ట్రంక్ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక, భారతదేశాన్ని క్లౌడ్ అండ్ AI గ్లోబల్ హబ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సూపర్-నోడ్
గా నిలబెట్టే సామర్థ్యం కలిగిన మెగా కార్యక్రమం. ఇది కేవలం విజయ గాథ కాదు, బాధ్యత, పారదర్శకత, సస్టైనబిలిటీ పరీక్ష కూడా. భారత ప్రభుత్వం, గ్లోబల్ పెట్టుబడిదారులు, స్థానిక సమాజాలు – మూడు వర్గాలు కలిసి.. డేటా సార్వభౌమత్వం, పర్యావరణ సమతుల్యత, సమాన అవకాశాలు వంటి అంశాలను కేంద్రంగా పెట్టుకుని ముందుకు సాగితేనే, ఈ మెగా పెట్టుబడి భారత్‌కు నిజమైన డిజిటల్ పునరుజ్జీవనంగా నిలుస్తుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.


.webp)



