వంద సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా?

posted on: May 13, 2026 1:00PM

ఇంధన ధరలు పెరుగడంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా..  వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా    అంతర్జాతీయ మార్గాల్లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులలో కోత విధించిందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  దాదాపు 100 విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం (మే 13) ప్రకటించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

 ఈ సర్వీసుల రద్దు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందనీ.. ఈ సర్వీసుల కోత మూడు నెలల పాటు ఉంటుందనీ  ప్రచారం జరుగుతోంది.   ప్రధానంగా దిల్లీ నుంచి షికాగో, నెవార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో. టొరంటో, పారిస్, షాంఘై నగరాలకువెళ్లే విమానసర్వీసులలో  ఇండియా కోత విధించింది. ఈ నిర్ణయంతో వేసవి కాలంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు   ఇబ్బందులు ఎదురు కావడం తథ్యంఅన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

అయితే విమాన సర్వీసులలో కోత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎయిర్ ఇండియా ఖండించింది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ విమాన సర్వీసులలో ఎటువంటి కోతా విధించలేదని స్పష్టం చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...