Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జంతువులతో మాట్లాడేస్తామా?.. వాటి భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ
posted on: Jun 5, 2026 11:00PM

మనం పంచతంత్రం కథలలో జంతువులు మాట్లాడతాయని చదువుకున్నాం. నక్కబావ, కొంగ, కుందేలు, పులి, సింహం, ఏనుగు ఇలా జంతువులు మాట్లాడుకోవడం విన్నాం.. కాదు కాదు చదివాం.
ఇప్పుడు ఆధునిక సాంకేతికత ఆనాటి ఊహాజనితమైన జంతువుల భాషను జనాలకు అర్థమయ్యేలా చేసే రోజులను తీసుకు వచ్చేస్తోంది. ఔను.. మనం రోజూ చూసే పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో మనకు అర్థమైతే.. ఆ ఊహే గొప్పగా ఉంది కదూ? సముద్ర గర్భంలో ఉండే భారీ తిమింగలాలు ఒకదానితో ఒకటి ఏం చెప్పుకుంటున్నాయో తెలుసుకోవడం ఎంత బాగుంటుంది? సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసిన ఇటువంటి వింతలు, విడ్డూరాలు త్వరలోనే నిజ జీవితంలోనూ సాకారం కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత సాయంతో జంతువులు, పక్షుల భాషను పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక విప్లవం మూగజీవాల నోటి నుంచి శబ్దాలను మనుషులు సులభంగా అర్థం చేసుకునేలా మారుస్తోంది.
ఈ సరికొత్త ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్న చాట్‌జీపీటీ వెనుక ఉన్న అత్యాధునిక సాంకేతికతనే శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. మూగజీవాల నోటి నుంచి వచ్చే శబ్దాల వెనుక దాగి ఉన్న అసలు సిసలైన అర్థాలను, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను కనిపెట్టడానికి ఏఐ అల్గారిథమ్స్ దోహదపడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎలుకలు, డాల్ఫిన్లు, కోతులు, రంగులు మార్చే కటిల్‌ఫిష్, పక్షులు, తిమింగలాలు వంటి జీవులపై జరిగిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు, ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల సమూహాల్లో ఒకదానికొకటి హెచ్చరించుకోవడానికి లేదా సమాచారం పంచుకోవడానికి చేసుకునే శబ్దాలను లోతుగా విశ్లేషించడంలో ఏఐ సిస్టమ్స్ శాస్త్రవేత్తలకు సహకారం అందిస్తున్నాయి.
ఈ పరిశోధనల్లో భాగంగా ఆఫ్రికన్ చారల ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో ఏకంగా 1.22 లక్షల కంటే ఎక్కువ రకాల శబ్దాలను ఏఐ సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అంత పెద్ద మొత్తంలో ఉన్న శబ్దాల డేటాను పరిశీలించిన ఏఐ.. వాటిలో వేర్వేరు సందర్భాల్లో ఎలుకలు చేసే విభిన్న రకాల పిలుపులను, వాటి ప్రత్యేక అర్థాలను వేరు చేసి చూపింది. ఈ సంఖ్యలు, పరిశోధనల సరళిని బట్టి జంతు ప్రపంచంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని అర్థమవుతోంది.
అలాగే సముదరంలో నివశించే తిమింగలాల భాషను అర్థం చేసుకోవడంపైనే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ తిమింగలాలు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి చేసుకునే మిలియన్ల కొద్దీ శబ్దాలను మిషన్ లెర్నింగ్, ఏఐ ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ తిమింగలాల శబ్దాలలో మనుషుల భాష తరహాలోనే ప్రత్యేకమైన పదాలు, ప్రాంతీయ మాండలికాలు, ఒకరినొకరు పిలుచుకునే పేర్లు వంటి నిర్మాణాత్మక నమూనాలు ఉన్నాయా అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి.
జంతువుల భాషను కేవలం ఒకవైపు నుండి అర్థం చేసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో వాటితో మనుషులు తిరిగి నేరుగా మాట్లాడేలా చేయడంపై కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఎర్త్ స్పిషీస్ వంటి అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన సంస్థలు జంతువుల శబ్దాల్లో దాగి ఉన్న రహస్య నమూనాలను విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మనుషులకు, జంతువులకు మధ్య పూర్తిస్థాయిలో అర్థవంతమైన సంభాషణలు సాధ్యమేనా అనే కీలకమైన అంశాన్ని పరిశీలిస్తున్నాయి.





