AI ఆర్థిక సలహాలు నమ్ముతున్నారా? ఈ 3 పెద్ద రిస్కులు తెలుసుకోండి!

posted on: Jun 23, 2026 11:49AM

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లను అడగడం మనకు ఒక అలవాటుగా మారిపోయింది. చదువు, ఉద్యోగం, వంటకాలు, ప్రయాణాలు.. ఇలా దేనికైనా ఐఐ సహాయం తీసుకుంటున్నాం. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది తమ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పన్నులు ఎలా తగ్గించుకోవాలి అనే ఆర్థిక సలహాల (Financial Advice) కోసం కూడా ఏఐ టూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఫిడిలిటీ ఇంటర్నేషనల్ (Fidelity International) ఇటీవల జరిపిన ఒక తాజా అధ్యయనం ప్రకారం, 18 నుండి 34 ఏళ్ల మధ్య వయసున్న యువ రిటైల్ ఇన్వెస్టర్లలో దాదాపు 36 శాతం మంది తమ పెట్టుబడి నిర్ణయాల కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. అదే సమయంలో 35 నుండి 54 ఏళ్ల వయసు వారిలో 29 శాతం మంది, 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 5 శాతం మంది మాత్రమే దీనిపై ఆధారపడుతున్నారు. బ్రిటన్‌కు చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ గణాంకాల ప్రకారం, గత ఏడాది మాత్రమే దాదాపు 28 మిలియన్ల మంది వయోజనులు తమ వ్యక్తిగత ఆర్థిక విషయాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించారు. ఈ సంఖ్యలు చూస్తుంటే ఏఐ ఆర్థిక సలహాదారుగా ఎంతగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

కానీ, ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది ఒక అద్భుతమైన సాధనం (Tool) మాత్రమే కానీ, అది అంతిమ అధికారం (Authority) కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏఐ అందించే సమాచారం లేదా సలహాలు కేవలం అది ట్రైన్ చేయబడిన డేటా ప్యాటర్న్స్ ఆధారంగా మాత్రమే వస్తాయి. దానికి మనుషుల లాగా ఆలోచించే లేదా నైపుణ్యంతో విశ్లేషించే 'రీజనింగ్ స్కిల్స్' ఉండవు. దీనివల్ల కొన్నిసార్లు సాంకేతికంగా సరిగ్గా అనిపించినా, నిజ జీవితంలో ఏమాత్రం పనికిరాని ప్రాక్టికల్ లేని సలహాలను ఏఐ ఇస్తుంది. ఉదాహరణకు, ఒక యూజర్ తన టాక్స్ బిల్లును ఎలా తగ్గించుకోవాలని చాట్‌బాట్‌ను అడిగినప్పుడు, అది "మొనాకో దేశానికి మారిపోండి" అని సలహా ఇచ్చింది. చట్టపరంగా మొనాకోలో టాక్స్ ఉండదనేది నిజమే అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఆ సలహా ఏమాత్రం ఉపయోగపడదు కదా! ఇలాంటి రియల్ వరల్డ్ పరిస్థితులను ఏఐ అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏఐ చాట్‌బాట్‌లకు ఇచ్చే 'ప్రాంప్ట్' లేదా ప్రశ్న ఎంత స్పష్టంగా ఉందనే దానిపైనే అది ఇచ్చే జవాబు ఆధారపడి ఉంటుంది. చాలా మంది తమ ఇన్కమ్ డీటెయిల్స్, పన్ను పరిమితులు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి వివరాలు ఏవీ చెప్పకుండానే, "నా సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?" అని అడుగుతుంటారు. ఇలాంటి అస్పష్టమైన ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలు మీ వ్యక్తిగత అవసరాలకు సరిపోవు సదా సరిపోవు సరే కదా, పెద్ద నష్టాలకు దారితీస్తాయి. ఒక ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో స్క్రీన్‌షాట్‌ను ఏఐకి షేర్ చేసి, "నేను దీన్ని రీబ్యాలెన్స్ చేయాలా?" అని అడిగాడు. కానీ అతను తన ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ పీరియడ్ లేదా తన రిస్క్ టోలరెన్స్ వివరాలను చెప్పలేదు. దాంతో ఆ ఏఐ టూల్ వెంటనే వాటిని 'అమ్మేయండి' అని సలహా ఇచ్చింది. ఒకవేళ అతను ఆ మాట విని అమ్మేసి ఉంటే, అనవసరంగా భారీ మొత్తంలో పన్ను (Tax Event) కట్టాల్సి వచ్చేది.

దీనికి తోడు, చాట్‌బాట్‌లలో మీ ఆర్థిక రహస్యాలను పంచుకోవడం అస్సలు సురక్షితం కాదు. ఉచితంగా లభించే ఏఐ టూల్స్ వెనుక మీ పర్సనల్ డేటా అనే పెద్ద ముడిపడి ఉంటుంది. మనం ఏఐ చాట్‌బాట్‌లతో చేసే సంభాషణలు ప్రైవేట్‌గా ఉంటాయని అనుకుంటాం కానీ, ఆ డేటా అంతా స్టోర్ చేయబడుతుంది. భవిష్యత్తులో ఆ టెక్నాలజీని మరింత డెవలప్ చేయడానికి నిపుణులు దాన్ని రివ్యూ చేసే అవకాశం ఉంది. గతంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) పై పనిచేసిన నిపుణులు.. యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, పన్ను గుర్తింపు సంఖ్యలను కూడా చాట్‌బాట్ బాక్స్‌లలో పేస్ట్ చేయడాన్ని తాము గమనించామని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, మీ డేటా పూర్తిగా ప్రైవేట్‌గా ఉండాలనుకుంటే, రహస్య ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐకి ఇవ్వకండి. ఆర్థిక ప్రణాళికల కోసం ఏఐని కేవలం ఒక రిఫరెన్స్ సమాచారంగా మాత్రమే వాడుకుంటూ, అంతిమ నిర్ణయాల కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడమే ఎల్లప్పుడూ సురక్షితం.

google-ad-img
    Related Sigment News
    • Loading...