Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐ ఎఫెక్ట్.. కొలువులు హాంఫట్
posted on: Feb 20, 2026 8:15AM
.webp)
కృత్రిమ మేధ ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా పడుతోంది. ఏఐ ఎఫెక్ట్ తో రానున్న ఏడాది ఏడాదిన్నర కాలంలో లక్షలాది మంది తమ కొలువులు కోల్పోయి రోడ్డున పడనున్నారు. ప్రధానంగా వైట్ కాలర్ జాబ్స్ కు ఇక కాలం చెల్లినట్టేనని అంటున్నారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రూ యాంగ్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈయన గతంలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కూడా కావడం గమనార్హం. ఏఐ ద్వారా నిముషాల్లో అయ్యే పని గతంలో డిజైనర్లు నెలల తరబడి చేసేవారని, ఇది ఉద్యోగులకు, ఉద్యోగాలకు ఉన్న ముప్పుకు సంకేతమని చెప్పారు. ఆయన కథనం ప్రకారం ప్రకారం కామార్కెటింగ్ నిపుణులు, కోడర్లు, కాల్ సెంటర్ సిబ్బంది, డేటా అనలిస్టులు చేసే పనులను ఏఐ ఇప్పుడు సులభంగా పూర్తి చేస్తోంది. సమాచారాన్ని విశ్లేషించి నివేదికలు ఇచ్చే సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం కూడా ముందుముందు ఉండదు.
ఒక్క అమెరికాలోనే రానున్న ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది కొలువులు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా.. అసలా ఉద్యోగాల అవసరమే ఉండని పరిస్థితి ఉత్పన్నమైనా ఆశ్చర్యం లేదు. ఈ ఉద్యోగాల కోత కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పైగా ఏఐ ఎఫెక్ట్ తో ఉద్యోగాల కోత ఇప్పటికే ప్రారంభమైంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను టిట్రెంచ్ చేయడం తెలిసిందే.



.webp)


