Latest News
క్రోమ్ బ్రౌజర్లోనే ఇన్ బిల్డ్ ఏఐ ఫీచర్లు
posted on: Mar 14, 2026 11:12AM

ప్రసిద్ధ సెర్చ్చ్ ఇంజిన్ గూగుల్ తన బ్రౌజర్లో కొత్త బిల్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ అప్‌డేట్‌తో బ్రౌజర్‌లోనే ఏఐ పని చేస్తుంది. తెలుగు సహా 50 భాషల్లో ఈ కొత్త అప్ డేట్ పని చేస్తుంది. ఈ ఫీచర్లు జెమినీ ఆధారంగా పని చేస్తాయి. దీనివల్ల యూజర్లు వెబ్ పేజీలను త్వరగా అర్థం చేసుకోవడం, సునాయాసంగా సమాచారం లభించడం జరుగుతుంది. బ్రౌజర్‌లోనే ఏఐ పనిచేయడం వల్ల వేరే యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమగ్రమైన, కచ్చితమైన సమాచారం ఎటువంటి జాప్యం లేకుండా అభిస్తుంది.
అలాగే సందేహాలకూ సమాధానాలు వెంటనే లభిస్తాయి. జీమెయిల్, మ్యాప్స్, కేలండర్, యూట్యూబ్ వంటి గూగుల్ సేవలతో కూడా ఏఐటూల్స్ అనుసంధానమై ఉండడం వల్ల ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడం వంటి పనులన్నీ బ్రౌజర్ ద్వారానే పూర్తయిపోతాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్లు, డెస్క్ టాప్, ఐఏఓస్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇండియా, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఈ అప్‌డేట్‌ను దశలవారీగా విడుదల కానుంది. దీనివల్ల గూగుల్ క్రోమ్ వినియోగం సులభతరమౌతుంది.






