Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐ ఆధారిత ట్రావెల్ అసిస్టెంట్ గూగుల్ మ్యాప్స్!
posted on: Mar 14, 2026 10:30AM
.webp)
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే నావిగేషన్ యాప్ అయిన గూగూల్ మ్యాప్స్ ఇప్పుడు మరింత స్మార్ట్ గా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను గూగుల్ తాజాగా విడుదల చేసింది. గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన దాదాపు దశాబ్దం తరువాత గూగుల్ చేసిన భారీ మార్పులతో ఈ గూగుల్ మ్యాప్స్ మరింత స్మార్ట్ గా మారాయి. ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లతో గూగుల్ మ్యాప్స్ ను అప్ డేట్ చేయడంతో అవి యూజర్లకు మరింత మెరుగ్గా ఉపయోపడననున్నాయి. ఇంతకీ తాజా అప్ డేట్స్ లో కొత్త ఫీచర్లు ఏంటంటే?..
ఆస్క్ మ్యాప్స్.. ఈ ఫీచర్ జెమినీ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. యూజర్లకు సమీపంలోని ప్రదేశాలు, రెస్టారెంట్లు, షాపులు వంటి వివరాలను వెంటనే అత్యంత కచ్చితత్వంతో అందిస్తుంది. అలాగే..ఇమ్మెర్సివ్ నేవిగేషన్ ఫీచర్ మ్యాప్స్‌లో రూట్‌ను మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో రోడ్లు, భవనాలు, జంక్షన్లు, ట్రాఫిక్ పరిస్థితులను త్రీడీ రూపంలో చూపిస్తుంది. అలాగే స్మార్ట్ జూమ్, మెరుగైన వాయిస్ గైడెన్స్, ప్రత్యామ్నాయ మార్గాల సూచనలు వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్లను దశల వారీగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియాలో కూడా ఆండ్రాయిడ్, ఐఓస్ యూజర్లకు ఇవి అందుబాటులోనికి రానున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌తో గూగుల్ మ్యాప్ యూజర్లకు మార్గదర్శకంగా పనిచేసే ఏఐ ఆధారిత ట్రావెల్ అసిస్టెంట్‌గా మారనుంది.






