Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆస్తి కోసం చెల్లిని చంపిన అన్న
posted on: Feb 4, 2026 4:10PM

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాదం కారణంగా సోదరుడు తన చెల్లెలు, అడ్వకేట్ స్వప్నను కత్తితో పొడిచి, బండరాయితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ స్వప్నకు ఆమె సోదరుడు రాజుతో గత కొద్దిరోజులుగా ల్యాండ్ వివాదం కొనసాగు తోంది. తల్లి తనకు చెందిన 10 ఎకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు పిల్లలకు పంచగా, 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు రాసిచ్చింది. అయితే తల్లి స్వప్నకు భూమి రాయడం రాజుకు నచ్చలేదు. ఇదే వివాదం తీవ్రస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలోనే స్వప్న గతంలో తన సోదరుడు రాజుపై రెండు సివిల్ కేసులు దాఖలు చేసింది. అవి ప్రస్తుతం కోర్టులో విచారణ లో ఉన్నాయి. ఇదే విష యమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం న్యాయవాది స్వప్న తనకు చెందిన నాలుగు ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు పొలానికి వెళ్లింది. ఈ భూమిలో ఒక ఎకరాను ఇతర వ్యక్తికి అమ్మేందుకు ఆమె అగ్రి మెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన రాజు అక్కడికి చేరుకుని స్వప్నతో వాగ్వాదానికి దిగాడు.
అన్నాచెల్లెళ్ల మధ్యన మాటామాటా పెరగడంతో రాజు తీవ్ర ఆగ్రహంతో కత్తితో స్వప్నపై దాడి చేసి, అనంతరం బండరాయితో కొట్టి హత్య చేశాడు. సోదరుడు రాజ్ తో పాటు మరో ముగ్గురు కలిసి ఈ హత్య చేశారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడిం చారు. రాజుకు సహకరిం చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టా మని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.... ఆస్తి విషయంలో చెల్లెలు తనను ఇబ్బంది పెడుతోందనే నెపంతో సోదరుడు రాజు ఈ హత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కేసు అన్ని కోణా ల్లో దర్యాప్తు చేస్తున్నామని, నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. లాయర్ స్వప్నకు పెళ్లి కాలేదని, ఆమె వృత్తిపరం గా చురుకైన న్యాయవాదిగా గుర్తింపు పొందిందని స్థాని కులు చెబుతున్నారని చేవెళ్ల డీసీపీ యోగేష్ అన్నారు. కుటుంబ కలహాల కారణంగా సొంత స సోదరినే అన్న హత్య చేయడంతో మొయినాబాద్ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది.



.webp)


