Latest News

హైదరాబాద్‌లో కల్తీ మాంసం దందా బట్టబయలు

posted on: Mar 11, 2026 6:04PM

 

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే టీ పౌడర్, అల్లం- వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నూనెలు వంటి అనేక కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తుండగా మరోవైపు తాజాగా కల్తీ మాంసాన్ని విక్రయిస్తూ... దండిగా డబ్బులు సంపా దిస్తున్న కేటుగాడు వ్యవహారం బయటపడింది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కొందరు వ్యాపారులు లాభాల కోసం అపరిశుభ్రమైన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, మంగళ్‌హాట్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. మంగళ్‌హాట్‌లోని చిస్టీ చెమాన్ ప్రాంతంలో ఉన్న  షాప్‌పై తనిఖీలు చేపట్టి... ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి భారీ ఎత్తున అపరిశుభ్రమైన, కుళ్లిన మాంసం నిల్వ ఉంచిన సుమారు 300 కిలోల కుళ్లిన మేక, గొర్రె మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం విలువ దాదాపు రూ.25 వేలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఈ సందర్భంగా గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ....  ఈ ఘటనలో మాంసం వ్యాపారి మహ్మద్ ఆఫ్రూస్‌ను అరెస్టు చేశామని అన్నారు. నిందితుడు మేక మరియు గొర్రెల వధశాలల వద్ద మిగిలిపోయే అవశేషాలను సేకరించి వాటిని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉంచి తాజాగా ఉన్నట్లు చూపిస్తూ కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ తదితర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మాంసాన్ని తెచ్చి నగరంలో విక్రయి స్తున్నట్లుగా డీసీపీ  తెలిపారు. ఇదే వ్యాపారిపై గతంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానా విధించినప్పటికీ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.

 ముఖ్యంగా తక్కువ ధరకు మాంసం అందిస్తాడని తెలుసుకొని ఫంక్షన్లు నిర్వహించే వారు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు కూడా విచారణ లో తేలింది. ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. అపరిశుభ్రమైన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఎక్కడైనా తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నట్లు  తెలిపారు. నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయా లపై ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ తనిఖీలు కొనసా గిస్తామని  గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వెల్లడించారు

google-ad-img
    Related Sigment News
    • Loading...